Mangala dosham: కుజ దోషం ఉంటే నిజంగానే పెళ్లి కాదా? మంగళ దోషం తొలగించుకునేందుకు పరిహారాలు ఏంటి?
Mangala dosham: జాతకంలో మంగళ దోషం లేదా కుజ దోషం ఉంటే పెళ్లి కావడం ఆలస్యం అవుతుందని అంటారు. అది నిజమేనా? మంగళ దోషం తొలగించుకునే మార్గాలు ఏంటి? అనేది తెలుసుకుందాం.
Mangala dosham: హిందూ ధర్మ శాస్త్రంలో మంగళ దోషం లేదా కుజ దోషం అంటే అందరూ భయపడతారు. అమ్మాయి లేదా అబ్బాయి జాతకంలో కుజ దోషం ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది. అలాగే వైవాహిక జీవితం సంతోషంగా ఉండదని చాలా మంది నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రంలో ఈ మంగళ దోషానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది.
జాతకంలో మంగళ దోషం ఉండటం వల్ల ఆ వ్యక్తి జీవితంలో అనేక సమస్యలు, సవాళ్ళు, వివాహ బంధంలో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు. అసలు ఈ కుజ దోషం అంటే ఏంటి అనే విషయం చాలా మందికి తెలియదు. పేరు అయితే అందరూ వినే ఉంటారు కానీ అది జాతకంలో ఏ విధంగా వస్తుందో తెలియదు.
కుజ దోషం అంటే ఏంటి?
జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు లేదా అంగారకుడు స్థితి బలంగా ఉంటే అతని జీవితంలో సంతోషం, ధైర్యం ఉంటాయి. మీ జాతకంలో 1వ, 2వ, 4వ, 7వ, 8వ లేదా 12వ ఇంట్లో ఉంటే కుజుడు ఉంటే కుజ దోషం ఏర్పడుతుంది. ఈ స్థానాల్లో కుజుడు ఉంటే ఆ వ్యక్తి జీవితంలో కలతలు, కష్టాలు, వైవాహిక జీవితం విచ్చినంగా అయిపోయింది.
వివాహ జాతకంలో ఈ దోషం ఉంటే ఆ వ్యక్తి ప్రవర్తన కోపంగా, అహంకారంగా ఉంటుంది. ఆనందం, సంతోషం ఉండదు. ఏడవ ఇంట్లో కుజుడు ఉంటే వైవాహిక జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. దీని వల్ల దాంపత్య జీవితం కలహాల కాపురంగా మారుతుంది. 12వ ఇంట్లో మంగళ దోషం ఉంటే ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.
మంగళ దోష పరిహారాలు
జాతకంలో మంగళ దోషం ఉంటే పెళ్లి చేసుకునేందుకు చాలా మంది ఆలోచిస్తారు. కుజ దోషం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మాత్రం సమస్యలు ఉండవు. ఈ కుజ దోషం వల్ల పెళ్లి ఆలస్యం అవుతుందని అంటారు. కానీ జాతకంలో కుజుడు స్థానం బలపరుచుకుంటే ఈ దోష ప్రభావం ఉండదు. అందుకోసం కొన్ని పరిహారాలు పాటించాలి.
కుజ దోషం ఉన్న ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి పూజలు చేయాలి. ఆరోజు హనుమంతుడిని పూజించాలి. హనుమాన్ చాలీసా సుందర కాండ చదవడం చేయాలి. మంగళవారం అంగారక గ్రహానికి అంకితమైన రోజు. అందుకే ఆరోజు ఉపవాసం ఉండి పూజ చేయడం వల్ల ప్రతికూల ప్రభావం తగ్గించుకోవచ్చు.
ఈ దోషం ఉన్న వాళ్ళు కుంభ వివాహం చేసుకోవచ్చు. అంటే కుజ దోషం లేని వారిని పెళ్లి చేసుకునే ముందు విష్ణువు విగ్రహాన్ని వివాహం చేసుకోవాలి. ఇలా చేస్తే దోష ప్రభావం వారి జీవితం మీద సన్నగిల్లుతుంది. దీన్నే కుంభ వివాహం అంటారు.
ఉజ్జయినిలోని మహావీర్ నాథ్ ఆలయంలో మంగళ దోష పూజ నివారణ చేయించుకోవడం అత్యంత ప్రభావవంతమైన నివారణలలో ఒకటి.
కుజ దోషం ఉన్న వాళ్ళు జ్యోతిష్యుల సూచన మేరకు ఉంగరం వేలికి పగడపు రంగు ఉంగరం ధరించవచ్చు. ఈ రంగు అంగారక గ్రహ శక్తితో ముడి పడి ఉంటుంది. మంగళ దోషం ఉన్న వ్యక్తులు మంగళవారం ఈ రాయి ఉంగరం ధరించడం వల్ల మంచి జరుగుతుంది. అయితే తప్పనిసరిగా జ్యోతిష్యుల సూచన ప్రకారమే ధరించాలి.
పేదలకు ఎరుపు రంగు ధాన్యాలు, ఎరుపు రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా ప్రయోజనం పొందుతారు. అంగారకుడి ప్రభావం తగ్గాలంటే ఎరుపు రంగు వస్తువులు దానం చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు.