Sun transit: సూర్యుడు నెలకు ఒకసారి రాశి చక్రం మారుస్తూ ఉంటాడు. నవగ్రహాలలో సూర్యుడిని అన్ని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. సూర్యుడు శుభప్రదంగా ఉన్నప్పుడు వ్యక్తి అదృష్టం పెరుగుతుంది. ఏప్రిల్ 13న సూర్యుడు మీన రాశి నుంచి మేషరాశి లోకి ప్రవేశిస్తాడు.
సూర్యుడి మీన రాశిని వీడటం వల్ల ఖర్మ రోజులు కూడా ముగిసిపోతాయి. గ్రహాల రాజు మొత్తం పన్నెండు రాశులలో ధనుస్సు, మీన రాశిలో సంచరించినప్పుడు ఖర్మల కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించరు. నవగ్రహాలలో తిరోగమన దశలో ప్రయాణించని ఒకే ఒక గ్రహం సూర్యుడు. మేష రాశిలో సూర్యుడు ప్రవేశించిన వెంటనే దేవగురువు బృహస్పతితో సంయోగం చెందుతాడు. ఈ రెండు గ్రహాలు సుమారు పన్నెండు సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నాయి.
సూర్యుడి రాశి చక్రం మారడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది. సూర్యుడి సంచారంతో ఏ ఏ రాశుల వారికి శుభదాయకం కాబోతుందో తెలుసుకుందాం
సూర్యుడు రాశి మీన రాశిని విడిచి మేష రాశిలోకే ప్రవేశిస్తాడు. ఈ సంచారం మేష రాశి వారికి అద్భుతమైన విజయాన్ని చేకూరుస్తుంది. సంపద, సమృద్ధి పెరుగుదలతో ఆర్థిక శ్రేయస్సును పొందుతారు. భౌతిక సౌకర్యాలు అనుభవిస్తారు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. సహనం, పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడి భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది. వ్యాపార రంగంలో విదేశీ ఒప్పందాలు చేసుకుంటారు. జీవిత భాగస్వామితో కొనసాగుతున్న ఇబ్బందులు క్రమంగా సమసిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. లవ్ లైఫ్ రొమాన్స్ తో నిండిపోతుంది.
సూర్యుడి సంచారం వల్ల మిథున రాశి జాతకులు శుభ ఫలితాలు పొందుతారు. నాయకత్వ సామర్థ్యం, అధికారం పెరుగుతాయి. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది. ఆత్మవిశ్వాసంతో సరైన మార్గంలో నడుస్తారు. కుటుంబం సంతోషంతో నిండిపోతుంది. ఆర్థిక పురోగతిని అనుభవిస్తారు. సంఘంలో పేరు, ప్రఖ్యాతలు పొందుతారు. అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. నిలిచిపోయిన డబ్బు కూడా చేతికి అందుతుంది. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం శుభప్రదంగా ఉంటుంది. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది.
సింహ రాశి వారికి సూర్యుడి సంచారం శుభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కెరీర్ లో విజయం సాధిస్తారు. దృఢ సంకల్పంతో ఎన్నో విజయాలు సాధిస్తారు. మీ బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకునేందుకు కృషి చేస్తారు. ధన ప్రవాహానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ సమయం లావాదేవీలకు అనుకూలంగా ఉంటుంది.
సూర్యుడి సంచార ప్రభావం కన్యా రాశి వారికి మేలు చేస్తుంది. ఈ సమయంలో మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. కార్యాలయంలో గౌరవం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మీరు అద్భుతంగా, సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగం వ్యాపారంలో శుభవార్తలు వింటారు. పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు నియంత్రించుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది.