Sun nakshatra transit: రోహిణి నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ కాలంలో కొన్ని మొక్కలు నాటితే నరకం నుంచి విముక్తి
Sun nakshatra transit: మరి కొన్ని రోజుల్లో సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో రోహిణి కార్తె ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో కొన్ని మొక్కలు నాటడం వల్ల నరకం నుంచి విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
Sun nakshatra transit: జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించడంతో రోహిణి కార్తె ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కృతికా నక్షత్రంలో ఉన్న సూర్యుడు మే 25వ తేదీ నుంచి రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.

సూర్యుడు రోహిణి నక్షత్రంలో జూన్ 8 వరకు ఉంటాడు. ఈ నక్షత్రంలో సూర్యుడు ఉన్నన్ని రోజులు ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది .అందుకే రోహిణి కార్తెలో రోకళ్లు పగిలే ఎండ ఉంటుందని నానుడి. ఈ కాలంలో భానుడి ప్రతాపం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈ సమయంలో సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల ఈ కాలంలో రక్షణ లభిస్తుందని నమ్ముతారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం కొన్ని పద్ధతిలు అనుసరించాలి. ఈ పద్ధతులు అనుసరిస్తే మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు తీసుకొస్తాయి. మీరు పెరుగు, పాలు, కొబ్బరి నీళ్లు, శీతల పదార్థాలను దానం చేయడం మంచిది. ఇవి సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైనది.
రోహిణి కార్తె సమయంలో మహిళలు చేతికి, కాళ్ళకు గోరింటాకు పెట్టుకుంటారు. దీని ప్రభావం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ఈ రోజుల్లో ప్రజలు మృదువైన కాటన్ దుస్తులు ధరించాలి. వేయించిన, కారంగా ఉండే వస్తువులు తినడం మానుకోవాలి.
ఈ చెట్లు నాటండి
రోహిణి కార్తెలో చెట్లను నాటడం చాలా శుభప్రదంగా పరగణిస్తారు. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి పూర్వీకులు సంతోషిస్తారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యదేవుడు రోహిణి నక్షత్రంలో ఎన్ని రోజులు ఉంటాడో భూమిపై వేడి అంత ఎక్కువగా ఉంటుంది. సూర్యదేవుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించిన వెంటనే చంద్రుడి ప్రభావం తగ్గుతుంది .ఈ సమయంలో చెట్లను నాటడం, నీరు పోయడం వంటి పనులు చేయడం వల్ల చాలా పుణ్యం లభిస్తుంది. చెట్లని నాటడం వల్ల మరణానంతరం నరకం అనుభవించాల్సిన అవసరం ఉండదు. రోహిణి కార్తె సమయంలో ఏ మొక్కలు నాటాలి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
తులసి
హిందువులకు తులసి చాలా పవిత్రమైనది. చాలామంది ఇంట్లో పెట్టుకుని నిత్యం పూజలు చేస్తారు. లక్ష్మీదేవి, విష్ణుమూర్తికి విశిష్టమైనది ఇది. ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో తప్పనిసరిగా తులసి మొక్కను నాటాలని మత విశ్వాసాలు చెబుతున్నాయి. దీని ద్వారా మరణానంతరం వైకుంఠ ప్రాప్తి పొందుతారు.
అరటి
అరటి మొక్క విష్ణువు, బృహస్పతికి ప్రీతికరమైనది. మీరు ఈ సమయంలో అరటి మొక్క నాటడం వల్ల వారి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి
ఉసిరి
విష్ణుమూర్తి ప్రీతికరమైన మరో మొక్క ఉసిరి. ఇది నాటడం వల్ల విష్ణు ఆశీర్వాదాలు లభిస్తాయి.
కరివేపాకు
ఈరోజుల్లో కరివేపాకు నాటడం కూడా చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఔషధ గుణాలు, ఆధ్యాత్మిక లక్షణాలకు కరివేపాకు ప్రసిద్ధి చెందింది. వేప మొక్క నాటలేకపోతే కరివేపాకు నాటినా మంచి ఫలితాలు కలుగుతాయని గ్రంథంలో ప్రస్తావించారు.
మనుస్మృతి ప్రకారం చెట్లు నాటడం వల్ల యాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. దంపతులకు పిల్లలు లేకపోతే చెట్లు నాటాలని పద్మ పురాణం చెబుతోంది. ఎందుకంటే చెట్లు కూడా పిల్లలు లాగే పెరుగుతాయి. ఇలా చేయడం వల్ల సంతానప్రాప్తి కలుగుతుంది.
వరాహ పురాణం ప్రకారం రావి చెట్టు, వేప, మర్రి చెట్టు, రెండు దానిమ్మ, రెండు నారెంజ, 5 మామిడి, 10 పూల మొక్కలు నాటడం వల్ల నరకం నుండి ఉపశమనం లభిస్తుంది. చెట్లను నాటడం వల్ల అశ్వమేధ యాగం వంటి పుణ్యఫలాలు లభిస్తాయని విష్ణు ధర్మోత్తర పురాణం చెబుతోంది.