Sun transit: సొంత రాశిలోకి సూర్యుడు.. సింహ రాశి వారికి నెల రోజులు అద్భుతకాలమే-sun is coming in its zodiac sign from august 16 this zodiac will have better fortunes ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sun Transit: సొంత రాశిలోకి సూర్యుడు.. సింహ రాశి వారికి నెల రోజులు అద్భుతకాలమే

Sun transit: సొంత రాశిలోకి సూర్యుడు.. సింహ రాశి వారికి నెల రోజులు అద్భుతకాలమే

Gunti Soundarya HT Telugu
Aug 13, 2024 03:05 PM IST

Sun transit: సూర్యుడు తన రాశిని కర్కాటక రాశి నుండి సింహరాశికి మారుస్తున్నాడు. ఆగస్ట్ మధ్యలో సూర్యుడు సింహరాశిలో సంచరించడం వల్ల అనేక రాశుల వారు ప్రయోజనం పొందుతారు. అయితే సూర్యుడు సంచరిస్తున్న రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

సింహ రాశిలోకి సూర్యుడు
సింహ రాశిలోకి సూర్యుడు

Sun transit: సింహ రాశి సూర్యుని ఇల్లు. అంటే సింహ రాశికి సూర్యుడు అధిపతి అని అర్థం. సూర్యుడు ఈ రాశిలో ఒక నెల పాటు ఉంటాడు. దీని తర్వాత సూర్యుడు కన్యా రాశిలోకి వెళ్తాడు. కన్యా రాశిలో సూర్యుడు కేతువుతో కలయిక ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కన్యా రాశిలో కేతువు ఉన్నాడు. 

ఆగస్ట్ 16 శుక్రవారం సాయంత్రం 7 గంటలకు సూర్యుడు సింహ రాశి ప్రవేశం చేస్తాడు. దీన్నే సింహ సంక్రాంతి అంటారు. ఇక ఇదే రోజు సూర్యుడు తన నక్షత్రాన్ని కూడా మార్చబోతున్నాడు. కేతువుకు చెందిన మాఘ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడి రాశి మార్పు ప్రభావం ప్రతి రాశికి దాని ఫలితం భిన్నంగా ఉంటుంది. కానీ మీ జాతకంలో మహాదశ, అంతర్దశ కారణంగా వివిధ ప్రభావాలు ఉంటాయి. నవగ్రహాలలో సూర్యుడిని గ్రహాల రాజుగా పిలుస్తారు. తొమ్మిది గ్రహాలలో సూర్యుడు, చంద్రుడు ఎప్పుడూ తిరోగమన దశలో సంచరించరు. మిగతా గ్రహాలు మాత్రం తిరోగమన దశలోకి వెళతాయి. 

సింహ రాశికి ఎందుకు ప్రత్యేకం

సుమారు ఏడాది తర్వాత సూర్యుడు తన సొంత రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అందువల్ల ఈ రాశి వారికి చాలా ప్రత్యేకమైన మార్పులు ఎదురుకాబోతున్నాయి.  సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశివారి వ్యక్తిత్వంలో ఆకస్మిక మార్పులు వస్తాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ సంకల్ప శక్తి కూడా పెరుగుతుంది. మీరు వ్యక్తిత్వం, మొత్తం విషయాలలో పెద్ద మార్పులను చూస్తారు. మీరు మొదట ఎనర్జిటిక్‌గా ఉంటారు. ప్రతి పనిలో మీరు సానుకూలతను చూస్తారు. మీరు మీ వృత్తి జీవితంలో కొంచెం గర్వంగా ఉండవచ్చు, కానీ మీ వ్యక్తిగత జీవితంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. కోపం పెరుగుతుంది కానీ మీరు దానిని నియంత్రించుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి. కెరీర్ లో విజయం సాధిస్తారు. నూతన ఆదాయ మార్గాల ద్వారా భారీ ధనలాభం వస్తుంది. 

మేషం, కర్కాటక రాశి వారికి ఎందుకు ప్రత్యేకం?

సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించడం వల్ల మేష, కర్కాటక రాశుల వారికి కూడా ప్రత్యేకంగా ఉండబోతుంది. ఈ రెండు రాశుల వాళ్ళు అనేక ప్రయోజనాలు పొందుతారు. ఈ వ్యక్తులు వారి వృత్తి జీవితంలో విజయం సాధించబోతున్నారు. మీ పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి. మొత్తమ్మీద ఈ రాశుల వారికి ఆత్మవిశ్వాసం రెట్టింపు ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కానుకగా రాబోతుంది. సూర్యుడి సంచారం ఈ రాశి వారి జీవితంలో సంతోషం, శ్రేయస్సును తీసుకొస్తుంది. వ్యాపారం పుంజుకుంటుంది. వైవాహిక, ప్రేమ జీవితం అద్భుతంగా గడిచిపోతుంది. క్రమేపీ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కెరీర్ లో దూసుకుపోతారు.

నిరాకరణ: ఇక్కడ సమాచారం కేవలం ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. HT Telugu ఏ సమాచారాన్ని ఆమోదించదు లేదా ధృవీకరించదని పేర్కొనడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణులను సంప్రదించండి.