Study room vastu tips: మీ పిల్లల స్టడీ రూమ్ ఇలా ఉంచండి- ఏకాగ్రత పెరుగుతుంది, చదువుకోవాలనే ఆసక్తి వస్తుంది
Study room vastu tips: స్టడీ రూమ్‌లో వాస్తుకు సంబంధించిన కొన్ని నియమాలను పాటించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది స్టడీ రూమ్ నుండి ప్రతికూలతను తొలగిస్తుంది. పిల్లల ఏకాగ్రత శక్తిని మెరుగుపరుస్తుంది.
Study room vastu tips: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వాస్తు నియమాలను పాటించడం వల్ల ఇల్లు లేదా కార్యాలయంలో సానుకూలత ఏర్పడుతుంది. జీవితంలో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. వాస్తులో పూజ గది, పడకగది, డ్రాయింగ్ రూమ్, టాయిలెట్, బాత్రూమ్‌తో సహా ప్రతిదానికీ దిశ, స్థానంతో సహా అనేక ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వాటిని అనుసరించడం వల్ల ప్రగతి పథంలో ఎలాంటి ఆటంకాలు ఉండవని, జీవితం సుఖంగా గడిచిపోతుందని నమ్మకం.
మీ పిల్లలకు చదువుపై ఆసక్తి లేకుంటే లేదా వారి కెరీర్‌లో అడ్డంకులు ఎదురైతే స్టడీ రూమ్‌కి సంబంధించిన కొన్ని వాస్తు చిట్కాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. స్టడీ రూమ్ ఏ విధంగా ఉంటే పిల్లలకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వారికి చదువు మీద ఆసక్తి కలుగుతుంది అనే విషయాలు తెలుసుకుందాం.
స్టడీ రూమ్ వాస్తు చిట్కాలు
వాస్తు ప్రకారం పిల్లలు చదువుకునే సమయంలో తూర్పు లేదా ఉత్తరం వైపు చూడాలి. ఉత్తరం లేదా తూర్పున ఉన్న స్టడీ రూమ్‌లో సరస్వతీ దేవి లేదా మీకు ఇష్టమైన దేవత విగ్రహాన్ని ఉంచి వాటిని క్రమం తప్పకుండా పూజించిన తర్వాత మాత్రమే అధ్యయనం ప్రారంభించండి.
ఇది కాకుండా అధ్యయన గదిలో శాస్త్రవేత్తలు, మహానుభావులు లేదా పండితుల చిత్రాలను ఉంచవచ్చు. ఇవి వారిలో స్పూర్తిని నింపుతాయి.
వాస్తు ప్రకారం పుస్తకాలను వాయువ్య దిశలో ఉంచకూడదు. స్టడీ రూమ్‌లో గాలి, వెలుతురు సరిగా ఉండే విధంగా చూసుకోవాలి. స్టడీ టేబుల్ చతురస్రాకారంలో ఉన్నది ఏర్పాటు చేయండి. చదువుకోవడానికి సంబంధించిన టైమ్ టేబుల్ గోడ మీద అతికించడం మంచిది.
తడి నేలపై పుస్తకాలను ఎప్పుడూ ఉంచవద్దు. దీనివల్ల పుస్తకాల్లో చెదపురుగులు వచ్చి పుస్తకాలు పాడవుతాయి.
వాస్తు ప్రకారం మీ పిల్లలకు చదువులో ఏకాగ్రత లోపిస్తే పడమర వైపు, తూర్పు వైపు ఒక కుర్చీ, టేబుల్ ఉంచి అందులో కూర్చుని చదువుకోమని చెప్పండి. సూర్య దేవుడి రాగి ప్రతిమ లేదంటే ఉదయిస్తున్న సూర్యుడి చిత్ర పటాన్ని పెట్టవచ్చు. వీటితో పాటు ప్రకృతికి సంబంధించిన రమణీయమైనవి పెట్టుకోవచ్చు.
వాస్తు ప్రకారం ఇంట్లోని స్టడీ రూమ్ రంగు లేత నీలం రంగులో ఉండాలి. నలుపు, ఎరుపు రంగులు ఉంచడం శుభప్రదం కాదు. లైట్ కలర్ పెయింటింగ్స్ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసులో ఎటువంటి గందరగోళ వాతావరణం లేకుండా చదువులో ఏకాగ్రతను కొనసాగించడంలో సహాయపడుతుంది. ఈ రంగు ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతతను కలిగిస్తుందని చెబుతారు. ఇది కాకుండా లేత ఆకుపచ్చ, క్రీమ్ రంగులు కూడా స్టడీ రూమ్‌కు శుభప్రదం.
ఇవి ఉండకూడదు
స్టడీ రూమ్ లో వీడియో గేమ్స్, టీవీ, ఫోన్స్, మ్యాగజైన్స్, జంక్ ఫుడ్ వంటివి అసలు పెట్టొద్దు. దీని వల్ల వారికి చదువు మీద ఆసక్తి తగ్గిపోతుంది. ప్రతికూల శక్తులు ప్రసారమవుతాయి.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.
టాపిక్