Feng shui tips: పిల్లల స్టడీ రూమ్‌లో సానుకూల శక్తిని పెంచుకోవడానికి ఈ పనులు చేయండి
Feng shui tips: కొన్నిసార్లు ఇంట్లో వాస్తు లోపాలు మరియు ప్రతికూలతలు కూడా పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. అధ్యయన గదిలో ప్రతికూలతను తగ్గించడానికి, సానుకూల శక్తిని పెంచడానికి ఈరోజే ఈ ప్రత్యేక చిట్కాలను ప్రయత్నించండి.
Feng shui tips: కొంతమంది పిల్లలకు ఎంత చదివినా అసలు గుర్తుండదు. అలాగే పిల్లలకు చదువుకోవాలని అనిపించకపోవడం చాలా సార్లు జరుగుతుంది. లక్షలాది ప్రయత్నాలు చేసినా పిల్లవాడు మంచి మార్కులు తెచ్చుకోలేకపోతాడు. దీంతో ఒత్తిడి పెరిగి కుటుంబ సభ్యుల తిట్ల దండకం వినాల్సి వస్తుంది. తీవ్ర ఒత్తిడి వల్ల వాళ్ళ మానసిక పరిస్థితి దెబ్బతింటుంది.
ఇలా జరిగేందుకు కారణం ఒక్కోసారి మన ఇంటి వాస్తు దోషాలు ప్రతికూలతలు కూడా చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని తొలగించుకుంటే ఇవి పరిష్కారం అవుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందువల్ల స్టడీ రూమ్‌లోని ప్రతికూలతను తగ్గించడానికి, సానుకూల శక్తిని పెంచడానికి ఫెంగ్ షూయిలో ఇవ్వబడిన ఈ సులభమైన మరియు ప్రభావవంతమైన చిట్కాలను ఈరోజు ప్రయత్నించండి.
పరిశుభ్రత
పిల్లల స్టడీ రూమ్‌లో ఎలాంటి చెత్తా చెదారం ఎల్లప్పుడూ ఉండకుండా చూసుకోవాలి. టేబుల్ మీద వస్తువులు చిందరవందరగా అసలు పెట్టకూడదు. ఇంట్లోని ప్రతి గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అదే సమయంలో స్టడీ రూమ్‌లో ఏ మూలలోనూ చీకటి ఉండకూడదని గుర్తుంచుకోండి. ఇంటి ఉత్తర దిశను కూడా శుభ్రంగా ఉంచండి. ఇలా చేయడం వల్ల పిల్లలకు చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. అలాగే పిల్లల టేబుల్ మీద గ్లోబ్ పెట్టవచ్చు. ఉదయిస్తున్న సూర్యుడి ఫోటో గోడకు తగిలించవచ్చు.
జేడ్ ప్లాంట్
పిల్లలు ఎక్కువ కాలం చదువుపై దృష్టి పెట్టలేకపోతే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి కూడా దీనికి కారణం కావచ్చు. అందువల్ల ఇంట్లో సానుకూలతను ఆకర్షించడానికి, ఆనందం శ్రేయస్సును పెంచడానికి మీరు స్టడీ రూమ్‌లో జడే మొక్కను నాటవచ్చు. వాస్తు, ఫెంగ్ షూయి ప్రకారం జెడ్ మొక్క అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. అందుకే దీన్ని కుబేర మొక్క అని కూడా పిలుస్తారు. ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే దేనికి లోటు ఉండదు. డబ్బు కొరతతో సహా ఇతర సమస్యలు తగ్గుముఖం పడతాయి.
తాబేలు
ఫెంగ్ షూయి తాబేలును ఇంట్లో లేదా కార్యాలయంలో ఉంచడం వల్ల సమాజంలో వ్యక్తి కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుంది. ఈ తాబేలు ప్రతిమను ఇంటికి ఉత్తర దిశలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఫెంగ్ షుయ్ తాబేలును స్టడీ రూమ్‌లో ఉంచడం వల్ల వాతావరణంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.
మూడు నాణేలు
ఫెంగ్ షూయి ప్రకారం చైనా మూడు నాణేలు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ఈ నాణేలను ఎర్రటి గుడ్డలో చుట్టి లేదా ఎర్రటి దారంలో కట్టి ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుంది అని నమ్ముతారు. వీటిని ఇంట్లో వేలాడదీయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంట్లో సానుకూల శక్తులు ప్రవేశించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించండి.