Lord sun: ఆదివారం ఇలా చేస్తే సూర్యుడి అనుగ్రహంతో ఉద్యోగంలో ప్రమోషన్, కెరీర్ దూసుకెళ్తుంది-do these things on every sunday your luck will shine and get promotion in your job ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Sun: ఆదివారం ఇలా చేస్తే సూర్యుడి అనుగ్రహంతో ఉద్యోగంలో ప్రమోషన్, కెరీర్ దూసుకెళ్తుంది

Lord sun: ఆదివారం ఇలా చేస్తే సూర్యుడి అనుగ్రహంతో ఉద్యోగంలో ప్రమోషన్, కెరీర్ దూసుకెళ్తుంది

Gunti Soundarya HT Telugu
Jun 29, 2024 02:15 PM IST

Lord sun: సూర్య భగవానుడి అనుగ్రహం పొందటం కోసం ఆదివారం నాడు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆదివారం సూర్యుడిని ఏ విధంగా పూజ చేయాలి? సూర్య గ్రహాన్ని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన మార్గాలు ఏంటో తెలుసుకుందాం.

ఆదివారం ఇలా చేస్తే సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది
ఆదివారం ఇలా చేస్తే సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది

Lord sun: మత విశ్వాసాల ప్రకారం ఆదివారం సూర్య భగవానుడి రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున సూర్య భగవానుని పూర్తి ఆచారాలతో పూజిస్తారు. జాతకంలో గ్రహాల రాజు అయిన సూర్యుని స్థానం శుభప్రదంగా ఉంటే ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలున్నాయని నమ్ముతారు. ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి.

సూర్యభగవానుని అనుగ్రహం కోసం ఆదివారం ప్రత్యేక పూజలు చేస్తారు. ఆదివారం నాడు సూర్యుడిని ఏ విధంగా పూజించాలి, సూర్యుడిని బలపరిచే 3 ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయి. ప్రతి ఆదివారం వాటిని తప్పనిసరిగా పాటించడం వల్ల కెరీర్ లో ఉన్నతంగా రాణిస్తారు. అవి ఏ పనులో తెలుసుకుందాం.

ఆదివారం చేయాల్సిన పనులు

బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. గణేశుడిని ధ్యానించండి. ఒక రాగి పాత్రలో నీరు, ఎర్రటి పువ్వులు, ఎర్రటి రోలి, అక్షతలు, నల్ల నువ్వులను కలిపి ఉదయించే సూర్యునికి నీటిని సమర్పించాలి.

సూర్యుడిని అర్ఘ్యాన్ని సమర్పించేటప్పుడు మీరు సూర్య మంత్రం, గాయత్రీ మంత్రాన్ని పఠించాలి. అలాగే అర్ఘ్యం సమర్పించేటప్పుడు నీటి ప్రవాహంలో నుంచి సూర్య భగవానుని దర్శనం చేసుకోవడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల కంటి ఆరోగ్యం బలపడుతుంది. మొత్తం ఆరోగ్యం పొందుతారు. దీని తరువాత సూర్య భగవానుడికి ధూపం లేదా నెయ్యి దీపం చూపించి దాని చుట్టూ 3 సార్లు తిరగండి. చివరిగా సూర్యుడేవుడికి నైవేద్యాన్ని సమర్పించాలి. అనంతరం క్షమించమని ప్రార్థించాలి.

సూర్య దేవ్ మంత్రం

ఓం సూర్యాయ నమః

ఓం భాస్కరాయ నమః

ఓం ఆదిత్యాయ నమః

ఆదివారం నివారణ

ఆదివారం సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం, సూర్య మంత్రాన్ని పఠించడం, సూర్య చాలీసాను 11 సార్లు పఠించడం ద్వారా కెరీర్, ఆర్థిక జీవితంలో కొనసాగుతున్న సమస్యలు తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల జాతకంలో సూర్య గ్రహ స్థానం కూడా బలపడుతుంది.

జాతకంలో సూర్యుడు అశుభ స్థానంలో ఉంటే అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కళ్ళకు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. సమాజంలో గౌరవం, ప్రతిష్ఠ, నాయకత్వ స్థానం పొందాలంటే సూర్యుడి స్థానం శుభంగా ఉండాలి. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రయాణించేందుకు నెల సమయం పడుతుంది. పన్నెండు రాశులలో సింహ రాశికి సూర్యుడు అధిపతి.

సూర్యుడి అనుగ్రహం పొందటం కోసం ఆదిత్య హృదయ స్తోత్రం తప్పనిసరిగా పఠించాలి. ఇలా చేస్తే చాలా వరకు సూర్యుడి అశుభ ప్రభావాలు తగ్గుముఖం పడతాయి.

ఓం సూర్యాయ నమః

ఓం హ్రీం హ్రీం సూర్య నమః

ఓం ఘృణిః సూర్య ఆదిత్యోం

ఓం హ్రీం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః

అనే మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు, సూర్య దోషాలు తొలగిపోతాయి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner