Saturn moon conjunction: శని, చంద్రుల కలయిక.. ఈ రాశుల జాతకులు ఆశించిన విజయాలు, గౌరవం పొందుతారు-saturn moon conjunction will create raja yogam these zodiac signs get benefits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saturn Moon Conjunction: శని, చంద్రుల కలయిక.. ఈ రాశుల జాతకులు ఆశించిన విజయాలు, గౌరవం పొందుతారు

Saturn moon conjunction: శని, చంద్రుల కలయిక.. ఈ రాశుల జాతకులు ఆశించిన విజయాలు, గౌరవం పొందుతారు

Gunti Soundarya HT Telugu
Jun 21, 2024 06:08 PM IST

Saturn moon conjunction: కుంభ రాశిలో శని, చంద్రుడి కలయిక మరికొద్ది రోజుల్లో జరగబోతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి రాజయోగం ప్రభావంతో ఆశించిన విజయాలు, గౌరవం లభిస్తుంది. అవి ఏ రాశులో తెలుసుకుందాం.

శని చంద్రుల కలయిక
శని చంద్రుల కలయిక (stock photo)

Saturn moon conjunction: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట విరామం తర్వాత రాశిచక్ర గుర్తులను మారుస్తూ ఉంటాయి. దృక్ పంచాంగ్ ప్రకారం కర్మ, న్యాయానికి దేవుడైన శని ప్రస్తుతం కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. రాశి మార్చకుండా ఈ ఏడాది మొత్తం అదే రాశిలో ఉంటాడు. అయితే తన కదలికలు మార్చుకుంటాడు.

జూన్ 29 నుంచి శని కుంభ రాశిలో తిరోగమన దశలో సంచరించబోతున్నాడు. దానికి ముందుగానే చంద్రుడితో కలిసి రాజయోగం ఇస్తున్నాడు. జూన్ 26 న చంద్రుడు కుంభ రాశిలో సంచరిస్తాడు. రెండున్నర రోజుల పాటు చంద్రుడు ఇదే రాశిలో ఉంటాడు.

కుంభ రాశిలో చంద్రుడు, శని కలయిక వలన శశి యోగం ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారు చాలా శుభ ఫలితాలను పొందబోతున్నారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. మీరు ప్రతి రంగంలో ఆశించిన విజయాన్ని పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో చాలా పురోగతి ఉంటుంది. శని, చంద్రుల కలయిక వల్ల ఏ రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుందో తెలుసుకుందాం?

మిథున రాశి

శని, చంద్రుల కలయిక మిథున రాశి వారికి అదృష్టాన్ని చేకూరుస్తుంది. వృత్తిలో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. మీ కలలన్నీ నిజమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు ఉంటాయి. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలను నిర్వహించడం సాధ్యమవుతుంది. కొత్త దంపతులు సంతోషంగా జీవిస్తారు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి శశి యోగం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మీరు ఉద్యోగం, వ్యాపారంలో చాలా పురోగతిని సాధిస్తారు. వృత్తి జీవితంలో మీరు మీ పనికి కావలసిన ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందుతారు. వృత్తిలో ఆటంకాలు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. మనసు ఆనందంగా ఉంటుంది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి శశి యోగం వల్ల శుభం కలుగుతుంది. మీరు పాత పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు. భౌతిక సుఖాలలో జీవితాన్ని గడుపుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయి. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. కొంతమంది కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి యోచిస్తారు.

మకర రాశి

శని, చంద్రుల కలయిక మకర రాశి వారికి వరం కంటే తక్కువేమీ కాదు. ఇది మీకు ప్రతి సమస్య నుండి విముక్తి కలిగిస్తుంది. న్యాయపరమైన వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. మనస్సుకు శాంతి కలుగుతుంది. ప్రేమ జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంతో ఎక్కడికైనా ట్రిప్ కు వెళ్లవచ్చు. జీవితంలో ఆనందం మాత్రమే ఉంటుంది.

Whats_app_banner