తెలుగు న్యూస్ / ఫోటో /
Mrityunjaya Mantra : మృత్యుంజయ మంత్రం అర్థం ఏంటి?
- Maha Shivaratri 2024 : మహామృత్యుంజయ మంత్రం శివుని అనుగ్రహం పొందడానికి, మరణ భయాన్ని తొలగించడానికి జపించాలని హిందూ జ్యోతిష్యశాస్త్రంలో నమ్మకం. మృత్యుంజయ మంత్రం యొక్క అర్థం ఇప్పుడు తెలుసుకుందాం..
- Maha Shivaratri 2024 : మహామృత్యుంజయ మంత్రం శివుని అనుగ్రహం పొందడానికి, మరణ భయాన్ని తొలగించడానికి జపించాలని హిందూ జ్యోతిష్యశాస్త్రంలో నమ్మకం. మృత్యుంజయ మంత్రం యొక్క అర్థం ఇప్పుడు తెలుసుకుందాం..
(1 / 5)
శివుడు కోరుకున్న కోరికలను త్వరగా తీర్చగలడని పురాణాలు చెబుతున్నాయి. మార్కండేయ పురాణం, శివపురాణం ప్రకారం, శివుడికి మరణాన్ని కూడా తొలగించే శక్తి ఉంది. ఏ వ్యక్తి అయినా జీవితంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే, అలాంటి వారు శివుని మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.
(2 / 5)
ఎవరైతే మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించి శివునికి అభిషేకం చేసినా.. ఆ శివుని అనుగ్రహంతో మృత్యువుతో కలిగే ఆపదలు తొలగిపోతాయని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
(3 / 5)
మహామృత్యుంజయ మంత్రం : "ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్"
(4 / 5)
మహా మృత్యుంజయ మంత్రం యొక్క అర్థం : "జ్ఞాన దర్శనం కలిగిన మూడు కన్నుల భగవంతుడు (శివుడు) మనలో ఆధ్యాత్మిక చింతన ద్వారా ప్రపంచం నుండి మమ్మల్ని విముక్తి చేస్తాడు. మృత్యువు బంధాల నుండి విముక్తి పొందుతాం.''
ఇతర గ్యాలరీలు