తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Your Kid’s First Phone: మీ పిల్లలకు ఫస్ట్ ఫోన్ కొనిచ్చేముందు ఇది తప్పక చదవండి..

Your kid’s first phone: మీ పిల్లలకు ఫస్ట్ ఫోన్ కొనిచ్చేముందు ఇది తప్పక చదవండి..

25 October 2022, 20:48 IST

  • When to buy first phone to your kid?: స్మార్ట్ ఫోన్. ఇది రెండు వైపులా పదునున్న కత్తి వంటిది. దీంతో ఎన్ని ఉపయోగాలో? అంతకుమించి ప్రమాదాలు. ఎన్ని లాభాలో? అంతకుమించి నష్టాలు.. ముఖ్యంగా పిల్లలకు ఇప్పుడు పారాడే వయస్సు నుంచే స్మార్ట్ ఫోన్ చేతిలో పెడుతున్నాం. అది కరెక్టేనా?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

When to buy first phone to your kid?: పిల్లలకు ఫోన్ కొనివ్వడం ఇప్పుడు ఒక తప్పని ఖర్చు. స్కూల్స్ కూడా ఆ దిశగానే విద్యార్థులను ఎంకరేజ్ చేస్తున్నాయి. వాట్సాప్ ల్లో, స్కూల్ గ్రూప్స్ ల్లో, ఈ మెయిల్స్ లో ఎసైన్ మెంట్లు, యాక్టివిటీలు, హోం వర్క్ లు పంపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

When to buy first phone to your kid?: ఎప్పుడు కొనివ్వాలి?

అయితే, పిల్లలకు ఎప్పుడు సొంతంగా ఒక ఫోన్ ఇవ్వాలి. అనేది ఒక పెద్ద ప్రశ్న. ఏ వయస్సులో వారు ఫోన్ ను సరిగ్గా వాడగలరు? అనే విషయంలో భిన్న వాదనలున్నాయి. సగటున 11 ఏళ్లకే పిల్లలకు సొంతంగా స్మార్ట్ ఫోన్ ఉంటోందని ఒక సర్వేలో తేలింది. అయితే, పిల్లలకు ఫోన్ ఇచ్చేముందో, కొనిచ్చే ముందో ఈ విషయాలను మాత్రం పరిగణనలోకి తీసుకోవాలి.

  • కనీసం మిడ్ స్కూల్ వరకైనా పిల్లలకు సొంతంగా ఫోన్ ఇవ్వవద్దు. ఫోన్లో టైమ్ పాస్ యాక్టివిటీస్ కు సమయం వృధా చేస్తారు.
  • కచ్చితంగా పేరెంటల్ కంట్రోల్ ఆప్షన్ ఉన్న ఫోన్ నే తీసుకోండి. స్క్రీన్ టైమ్, ఆన్ లైన్ కంటెంట్ విషయంలో రెస్ట్రిక్షన్స్ పెట్టండి.
  • లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ డెవలప్ మెంట్, ఆర్టిస్టిక్ స్కిల్స్ డెవలప్ మెంట్ కు ఉపయోగపడే యాప్స్ ను, సుడోకు వంటి గేమ్స్ ను, రీడింగ్ హ్యాబిట్ ను డెవలప్ చేసే యాప్స్ ను ముందే ఇన్ స్టాల్ చేయండి. వాటి ని వాడడం నేర్పించండి.
  • సోషల్ మీడియా అకౌంట్ల ను బ్లాక్ చేయండి. తప్పని సరి అనుకుంటే, సైబర్ వేధింపుల గురించి, సైబర్ నేరాల గురించి, సోషల్ మీడియా నష్టాల గురించి అవగాహన కల్పించాకే వాటి వినియోగానికి అనుమతినివ్వండి.
  • మీ పిల్లలు వాడే సోషల్ మీడియా అకౌంట్లను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉండండి.
  • పబ్జీ వంటి హింసను ఎంకరేజ్ చేసే, టైం కిల్లింగ్ వీడియో గేమ్స్ కు దూరంగా ఉంచండి. వాటిని వాడకూడదనే ముందస్తు షరతుపైననే ఫోన్ కొనివ్వండి.
  • ఐఫోన్ లో ఫ్యామిలీ షేరింగ్ ఆప్షన్ ఉంటుంది. అది వాడుకోవచ్చు. iOS 16 update నుంచి ఏ వయస్సు వారు ఏ కంటెంట్ చూడాలో నిర్దేశించే ఆప్షన్లు ఉన్నాయి.
  • ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ఫ్యామిలీ లింక్ ఆప్షన్ వస్తోంది.