తెలుగు న్యూస్  /  National International  /  What Could Sena Rebel Eknath Shinde's Next Move Be?

Maharashtra politics : ఏక్​నాథ్​ షిండే నెక్స్ట్​ ఏం చేస్తారు? ఉద్ధవ్​ పరిస్థితేంటి?

Sharath Chitturi HT Telugu

23 June 2022, 13:51 IST

    • Maharashtra politics : శివసేన తిరుగుబాటు నేత ఏక్​నాథ్​ షిండే నెక్స్ట్​ ఏం చేస్తారు? ఇప్పుడు ఉద్ధవ్​ ఠాక్రే పరిస్థితి ఏంటి?
ఉద్ధవ్​ ఠాక్రే
ఉద్ధవ్​ ఠాక్రే (HT_PRINT/file)

ఉద్ధవ్​ ఠాక్రే

Maharashtra politics : మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తిరుగుబాటు నేత ఏక్​నాథ్​ షిండే- సీఎం ఉద్ధవ్​ ఠాక్రే వర్గాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఏ క్షణంలోనైనా మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి నెలకొంది. ఇంతకీ షిండే ఇప్పుడేం చేస్తారు? ఆయన నెక్స్ట్​ ఏం చేస్తారు? ఉద్ధవ్​ ఠాక్రే పరిస్థితేంటి?

ట్రెండింగ్ వార్తలు

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

శివసేన రెబల్స్​కు ఏక్​నాథ్​ షిండే నేతగా అధికారికంగా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2/3 కన్నా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి.. ఇదే అసలైన 'శివసేన' అని షిండే వర్గాం చెబుతోంది. తన పార్టీని అధికారికంగా గుర్తించాలని డిప్యూటీ అసెంబ్లీ స్పీకర్​ నరహరి జిర్వాల్​ను షిండే కలిసే అవకాశం లేకపోలేదు.

గవర్నర్​ భగత్​ సింగ్​ కోషియారిని ఏక్​నాథ్​ షిండే కలవొచ్చు! తన మద్దతుదారుల పేర్లతో కూడిన లేఖను ఆయనకు అందివచ్చు. భగత్​ సింగ్​.. కొవిడ్​తో ఉండటం వల్ల ఇదంతా వర్చువల్​గా కూడా జరిగే అవకాశం ఉంది.

భగత్​ సింగ్​ బాధ్యతలను గోవా గవర్నర్​ పీ. శ్రీధరన్​కు తాత్కాలికంగా అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే.. షిండేకు లైన్​ క్లియర్​ అయినట్టే. శ్రీధరన్​కు పగ్గాలు అందితే.. గౌహతీలో ఉన్న షిండే వర్గం అంతా.. గోవాకు మకాం మార్చే అవకాశాలు కూడా ఉన్నట్టు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

తనకు మద్దతివ్వాలని చెబుతూ.. ఎమ్మెల్యేలకు ఉద్ధవ్​ ఠాక్రే పిలుపునిచ్చారు. రాజీనామా చేస్తారా? లేక.. అసెంబ్లీలో బలపరీక్షకు వెళతారా? అన్న విషయంపై ఆ భేటీ తర్వాత స్పష్టత వస్తుంది.

తాజా పరిణామాలను బీజేపీ క్షుణ్ణంగా పర్యవేక్షిస్తోంది. షిండేకు లైన్​ క్లియర్​ అయితే.. ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ నేతలు.. గవర్నర్​ వద్దకు వెళ్లొచ్చు. 'సీఎం దేవేంద్ర ఫడణవీస్​' అంటూ ఔరంగాబాద్​లో పోస్టర్లు కూడా వెలిశాయి!

ప్రస్తుత పరిస్థితుల్లో.. ఉద్ధవ్​ ఠాక్రే కిందకి దిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. షిండే వర్గంపై ఉద్ధవ్​కు మద్దతుగా నిలిచిన వారు.. న్యాయపరమైన చర్యలకు దిగొచ్చు.

ఇదీ పరిస్థితి..

గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న ఏక్​నాథ్​ షిండే.. ఆదివారం రాత్రి ఒక్కసారిగా మాయమైపోయారు. కొన్ని గంటల పాటు ఎవరి ఫోన్​ కాల్స్​ కూడా ఎత్తలేదు. కాగా.. ఆయన గుజరాత్​ సూరత్​లోని ఓ హోటల్​లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. శివసేనపై ఆయన తిరుగుబాటు చేశారని, షిండే వెంటే.. 11-12 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఊహాగానాలు జోరుగా సాగాయి.

శివసేనలోని 55మంది ఎమ్మెల్యేల్లో.. ప్రస్తుతం 33మంది ఏక్​నాథ్​ వద్దే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

టాపిక్