Maharashtra politics : ‘మహా’ సీఎంగా ఏక్​నాథ్​ షిండే! ఉద్ధవ్​ ఒప్పుకుంటారా?-maharashtra politics will shivsena make eknath shinde as chief minister ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Maharashtra Politics, Will Shivsena Make Eknath Shinde As Chief Minister?

Maharashtra politics : ‘మహా’ సీఎంగా ఏక్​నాథ్​ షిండే! ఉద్ధవ్​ ఒప్పుకుంటారా?

Sharath Chitturi HT Telugu
Jun 23, 2022 06:32 AM IST

Maharashtra politics : మహా సంక్షోభం వేళ సీఎం అధికార నివాసాన్ని ఖాళీ చేశారు ఉద్ధవ్​ ఠాక్రే. ఏక్​నాథ్​ను సీఎం చేస్తే పరిస్థితులు చక్కపడతాయని కూటమి నేతలు భావిస్తున్నారు.

తిరుగుబాటు ఎమ్మెల్యేలతో ఏక్​నాథ్​ షిండే
తిరుగుబాటు ఎమ్మెల్యేలతో ఏక్​నాథ్​ షిండే (HT_PRINT)

Maharashtra politics : మహారాష్ట్ర రాజకీయాలు తీవ్ర ఉత్కంఠకు దారితీస్తున్నాయి. ఏక్​నాథ్​ షిండే వ్యవహారం శివసేనను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రెండు రోజులు గడిచిపోయినప్పటికీ.. ఈ విషయంపై ఓ స్పష్టత రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఏక్​నాథ్​ షిండేకు సీఎం పదవిని కట్టబెట్టి, పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఏక్​నాథ్​ ఒప్పుకుంటారా?

మహా వికాస్​ అఘాడీలోని పార్టీల మధ్య బుధవారం చర్చలు జరిగాయి. ఇందులో ఎన్​సీపీ అధినేత శరద్​ యాదవ్​ సైతం పాల్గొన్నారు. ఏక్​నాథ్​ షిండేను సీఎం చేయాలని అందరు భావించినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర సంక్షోభానికి ఇదొక్కటే పరిష్కారమని వారందరు అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

Eknath Shinde latest news : కాగా.. బుధవారం రాత్రి వర్చువల్​గా ప్రసంగించిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే.. తనకు పదవుల పట్ల ఆసక్తి లేదని పునరుద్ఘాటించారు. అవసరమైతే సీఎం పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.

ఉద్ధవ్​ వ్యాఖ్యలను ఏక్​నాథ్​ షిండే తిప్పికొట్టారు. అసహజ కూటమి నుంచి శివసేన బయటకు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. లేకపోతే కష్టమని తేల్చిచెప్పారు.

ఈ పరిణామాల మధ్య.. అసలు ఏక్​నాథ్​ షిండేకు ఏం కావాలి? అన్న విషయంపై స్పష్టత రావడం లేదు.

'మాతోశ్రీ'కి ఠాక్రే..

పదవులపై ఆసక్తి లేదన్న మాటలను నిరూపించేందుకు ఉద్ధవ్​ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రసంగం చేసిన కొన్ని గంటల్లోనే సీఎం అధికార నివాసాన్ని విడిచిపెట్టి మాతోశ్రీకి వెళ్లిపోయారు.

Uddhav Thackeray resigns : వందలాది మంది శివసేన కార్యకర్తలు ఆయన వెన్నంటే వెళ్లారు. ఉద్ధవ్​కు మద్దతుగా నినాదాలు చేశారు. ర్యాలీలు నిర్వహించారు.

ఇదీ సంక్షోభం..

గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న ఏక్​నాథ్​ షిండే.. ఆదివారం రాత్రి ఒక్కసారిగా మాయమైపోయారు. కొన్ని గంటల పాటు ఎవరి ఫోన్​ కాల్స్​ కూడా ఎత్తలేదు. కాగా.. ఆయన గుజరాత్​ సూరత్​లోని ఓ హోటల్​లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. శివసేనపై ఆయన తిరుగుబాటు చేశారని, షిండే వెంటే.. 11-12 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఊహాగానాలు జోరుగా సాగాయి.

సోమవారం నెలకొన్న పరిణామాలు చూస్తే ఇవి నిజమేనని తేలింది. ఇది మహారాష్ట్ర సంక్షోభానికి తెరతీసింది. ఉద్ధవ్​ ఠాక్రేను ఉక్కిరిబిక్కిరి చేసింది. అప్పటి నుంచి ఏక్​నాథ్​ మనసును మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

శివసేనలోని 55మంది ఎమ్మెల్యేల్లో.. ప్రస్తుతం 33మంది ఏక్​నాథ్​ వద్దే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మహా వికాస్​ అఘాడీ..

Maharashtra government news : 2019 ఎన్నికల్లో అధికార బీజేపీకి మెజారిటీ దక్కలేదు. సీఎం పదవి పంచుకుంటేనే మద్దతిస్తామని శివసేన తేల్చిచెప్పింది. అందుకు బీజేపీ అంగీకరించకపోవడంతో.. దశాబ్దాల మైత్రికి తెరపడింది.

ఆ తర్వాత.. ఎన్​సీపీ, కాంగ్రెస్​తో కలిసి మహా వికాస్​ అఘాడీని ఏర్పాటు చేసింది శివసేన. సీఎంగా ఉద్ధవ్​ ఠాక్రే ప్రమాణం చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్