Maharashtra politics : ‘మహా’ సీఎంగా ఏక్నాథ్ షిండే! ఉద్ధవ్ ఒప్పుకుంటారా?
23 June 2022, 6:32 IST
- Maharashtra politics : మహా సంక్షోభం వేళ సీఎం అధికార నివాసాన్ని ఖాళీ చేశారు ఉద్ధవ్ ఠాక్రే. ఏక్నాథ్ను సీఎం చేస్తే పరిస్థితులు చక్కపడతాయని కూటమి నేతలు భావిస్తున్నారు.
తిరుగుబాటు ఎమ్మెల్యేలతో ఏక్నాథ్ షిండే
Maharashtra politics : మహారాష్ట్ర రాజకీయాలు తీవ్ర ఉత్కంఠకు దారితీస్తున్నాయి. ఏక్నాథ్ షిండే వ్యవహారం శివసేనను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రెండు రోజులు గడిచిపోయినప్పటికీ.. ఈ విషయంపై ఓ స్పష్టత రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఏక్నాథ్ షిండేకు సీఎం పదవిని కట్టబెట్టి, పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఏక్నాథ్ ఒప్పుకుంటారా?
మహా వికాస్ అఘాడీలోని పార్టీల మధ్య బుధవారం చర్చలు జరిగాయి. ఇందులో ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్ సైతం పాల్గొన్నారు. ఏక్నాథ్ షిండేను సీఎం చేయాలని అందరు భావించినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర సంక్షోభానికి ఇదొక్కటే పరిష్కారమని వారందరు అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
Eknath Shinde latest news : కాగా.. బుధవారం రాత్రి వర్చువల్‌గా ప్రసంగించిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. తనకు పదవుల పట్ల ఆసక్తి లేదని పునరుద్ఘాటించారు. అవసరమైతే సీఎం పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.
ఉద్ధవ్ వ్యాఖ్యలను ఏక్నాథ్ షిండే తిప్పికొట్టారు. అసహజ కూటమి నుంచి శివసేన బయటకు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. లేకపోతే కష్టమని తేల్చిచెప్పారు.
ఈ పరిణామాల మధ్య.. అసలు ఏక్నాథ్ షిండేకు ఏం కావాలి? అన్న విషయంపై స్పష్టత రావడం లేదు.
'మాతోశ్రీ'కి ఠాక్రే..
పదవులపై ఆసక్తి లేదన్న మాటలను నిరూపించేందుకు ఉద్ధవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రసంగం చేసిన కొన్ని గంటల్లోనే సీఎం అధికార నివాసాన్ని విడిచిపెట్టి మాతోశ్రీకి వెళ్లిపోయారు.
Uddhav Thackeray resigns : వందలాది మంది శివసేన కార్యకర్తలు ఆయన వెన్నంటే వెళ్లారు. ఉద్ధవ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ర్యాలీలు నిర్వహించారు.
ఇదీ సంక్షోభం..
గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న ఏక్నాథ్ షిండే.. ఆదివారం రాత్రి ఒక్కసారిగా మాయమైపోయారు. కొన్ని గంటల పాటు ఎవరి ఫోన్ కాల్స్ కూడా ఎత్తలేదు. కాగా.. ఆయన గుజరాత్ సూరత్‌లోని ఓ హోటల్లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. శివసేనపై ఆయన తిరుగుబాటు చేశారని, షిండే వెంటే.. 11-12 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఊహాగానాలు జోరుగా సాగాయి.
సోమవారం నెలకొన్న పరిణామాలు చూస్తే ఇవి నిజమేనని తేలింది. ఇది మహారాష్ట్ర సంక్షోభానికి తెరతీసింది. ఉద్ధవ్ ఠాక్రేను ఉక్కిరిబిక్కిరి చేసింది. అప్పటి నుంచి ఏక్నాథ్ మనసును మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
శివసేనలోని 55మంది ఎమ్మెల్యేల్లో.. ప్రస్తుతం 33మంది ఏక్నాథ్ వద్దే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మహా వికాస్ అఘాడీ..
Maharashtra government news : 2019 ఎన్నికల్లో అధికార బీజేపీకి మెజారిటీ దక్కలేదు. సీఎం పదవి పంచుకుంటేనే మద్దతిస్తామని శివసేన తేల్చిచెప్పింది. అందుకు బీజేపీ అంగీకరించకపోవడంతో.. దశాబ్దాల మైత్రికి తెరపడింది.
ఆ తర్వాత.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి మహా వికాస్ అఘాడీని ఏర్పాటు చేసింది శివసేన. సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం చేశారు.
టాపిక్