తెలుగు న్యూస్  /  National International  /  Viral Video Shows Woman Throwing Cow Dung Cakes On Wall

Viral : పిడకలు కొట్టడం ఒక ఆర్ట్ అయితే​.. ఈ మహిళ అద్భుతమైన ఆర్టిస్ట్​!

Sharath Chitturi HT Telugu

02 July 2022, 7:47 IST

    • Viral : ఓ ఐఏఎస్​ అధికారి పోస్ట్​ చేసిన వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది. అందులో ఓ మహిళ పిడకలు కొడుతూ కనిపించింది. ఇందులో విషయం ఏముంది? అని అనుకుంటున్నారా? అయితే ఆ వీడియోను మీరూ చూసేయండి. 
పిడకలు కొట్టడం ఒక ఆర్ట్ అయితే​.. ఈ మహిళ అద్భుతమైన ఆర్టిస్ట్​!
పిడకలు కొట్టడం ఒక ఆర్ట్ అయితే​.. ఈ మహిళ అద్భుతమైన ఆర్టిస్ట్​! (Twitter)

పిడకలు కొట్టడం ఒక ఆర్ట్ అయితే​.. ఈ మహిళ అద్భుతమైన ఆర్టిస్ట్​!

Viral : ఓ మహిళ.. ఆవు పేడతో గోడకు పిడకలు కొడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఇందులో కొత్త విషయం ఏముంది? అని అంటారా? పిడకలు కొట్టడం విషయం కాదు.. కొడుతున్న తీరులోనే ఉంది విషయం అంతా!

ట్రెండింగ్ వార్తలు

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

Manipur news: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై కుకీ మిలిటెంట్ల దాడి; ఇద్దరు జవాన్లు మృతి

Nainital fire: నైనిటాల్ అడవుల్లో కార్చిచ్చు; జనావాసాల్లోకి విస్తరిస్తున్న మంటలు

JEE Advanced 2024 : నేడు జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

ఛత్తీస్​గఢ్​కు చెందిన ఐఏఎస్​ అధికారి అవనీష్​ శరన్​ ఈ వీడియోను ట్వీట్​ చేశారు. వీడియోలో ఓ మహిళ పిడకలు కొడుతోంది. పెద్ద గోడలో పైకి పిడకలు కొడుతోంది. సరైన క్రమంలో ఆ పిడకలు గోడకు అంటుకుపోతున్నాయి. అచ్చం.. బాస్కెట్​ బాల్​లో ప్లేయర్లు చేసినట్టే! అయితే ఇక్కడ ఎత్తు మాత్రం ఇంకా ఎక్కువగానే ఉండటం ఆశ్చర్యకరం.

'భారత్​ బాస్కెట్​ బాల్​ టీమ్​.. ఈ మహిళ కోసం వెతుకుతోంది,' అని ఫన్నీగా కామెంట్​ పెట్టారు ఆ ఐఏఎస్​ అధికారి.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ట్విట్టర్​లో ఈ వీడియోకు 1.5మిలియన్​ వ్యూస్​, 48000 లైక్స్​ వచ్చాయి.

'అద్భుతం','ఇలాంటి టాలెంట్లు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని వెలికితీయాలి' అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన వీడియోను ఇక్కడ చూడండి:

దేశంలో పిడకలను అనాదిగా ఉపయోగిస్తూనే ఉన్నారు. కర్ణాటకలో ఏకంగా ఓ పండుగే ఉంది. గోరెహబ్బ ప్రాంతంలో పండుగ సమయంలో ప్రజలు పిడకలతో ఒకరిని ఒకరు కొట్టుకుంటారు!