తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Viral Video : న‌డిరోడ్డుపై యువ‌కుడిపై కాల్పులు

Viral Video : న‌డిరోడ్డుపై యువ‌కుడిపై కాల్పులు

28 June 2022, 19:09 IST

Viral Video | ఒక ఎస్సై నిరాయుధుడైన ఒక యువ‌కుడిపై కాల్పులుజ‌రిపిన ఘ‌ట‌న పంజాబ్‌లోని మొహాలీలో చోటు చేసుకుంది. మొహాలీలో ఆదివారం రాత్రి పోలీసులు నాకాబందీ నిర్వ‌హిస్తుండ‌గా, కొంద‌రు యువ‌తీ, యువ‌కులు అక్క‌డికి వ‌చ్చారు. పోలీసుల‌తో వాగ్వాదానికి దిగారు. ఎస్సై బ‌ల్వీంద‌ర్ సింగ్ పై దాడికి దిగారు. ఆయ‌న యూనీఫాంను చింపేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. దాంతో, ఎస్సై బ‌ల్వీంద‌ర్ సింగ్ అందులోని ఒక యువ‌కుడి కాలుపై రివాల్వ‌ర్‌తో కాల్చారు. ప్ర‌స్తుతం ఆ యువ‌కుడు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. నిరాయుధుడైన యువ‌కుడిపై కాల్పులు జ‌రిపిన ఎస్సై బ‌ల్వీంద‌ర్ సింగ్‌ను స‌స్పెండ్ చేసి, కేసు న‌మోదు చేశారు. ఆ Viral Video దృశ్యాలు మీ కోసం హెచ్‌టీ తెలుగులో..