తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Vande Bharat Train Hits Cow Now: ఆవును ఢీ కొట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్

Vande Bharat train hits cow now: ఆవును ఢీ కొట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్

HT Telugu Desk HT Telugu

07 October 2022, 22:14 IST

  • Vande Bharat train hits cow now: ముంబై నుంచి గుజరాత్ లోని గాంధీ నగర్ కు వెళ్లే సెమీ హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ రైలు ‘వందేభారత్ ఎక్స్ ప్రెస్’ మరోసారి స్వల్ప ప్రమాదానికి గురైంది. 

ప్రమాదంలో స్వల్పంగా ధ్వంసమైన రైలు ఫ్రంట్ ప్యానెల్
ప్రమాదంలో స్వల్పంగా ధ్వంసమైన రైలు ఫ్రంట్ ప్యానెల్

ప్రమాదంలో స్వల్పంగా ధ్వంసమైన రైలు ఫ్రంట్ ప్యానెల్

Vande Bharat train hits cow now: ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ముహూర్తం సరిగ్గా కుదరనట్లుంది. ఈ ఎక్స్ ప్రెస్ రైలు శుక్రవారం గుజరాత్ లో స్వల్ప ప్రమాదానికి గురైంది. గుజరాత్ లోని ఆనంద్ స్టేషన్ కు దగ్గరలో ఒక ఆవును ఢీ కొన్నది.

Vande Bharat train hits cow now: ఫ్రంట్ పానెల్ డ్యామేజ్

శుక్రవారం ఉదయం గుజరాత్ లోని కంజారీ, ఆనంద్ స్టేషన్ల మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఒక ఆవును ఢీ కొన్నది. ఈ ఘటనలో రైలు ఫ్రంట్ ప్యానెల్ స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో ప్రయాణీకులకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని రైల్వే శాఖ వెల్లడించింది. ప్రమాదం జరిగిన 10 నిమిషాల తరువాత వందేభారత్ ఎక్స్ ప్రెస్ తిరిగి ప్రయాణం కొనసాగించింది.

Vande Bharat train hits cow now: రెండో ప్రమాదం..

వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురికావడం వరుసగా ఇది రెండో రోజు. గురువారం గుజరాత్ లోనే ఒక గేదెల మందను ఢీ కొనడంతో రైలు ఫ్రంట్ ప్యానెల్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ తరువాత దానిని రీప్లేస్ చేయాల్సి వచ్చింది. ఆ ప్రమాదంలో నాలుగు గేదెలు చనిపోయాయి. అయితే, ట్రాక్స్ పై పశువులను రైళ్లు ఢీకొనడం సాధారణమేనని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ వ్యాఖ్యానించారు.