తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Visa New Rule: అమెరికా వీసా కోసం వెయిటింగ్ తగ్గించేలా.. భారతీయుల కోసం కొత్త రూల్

US Visa New Rule: అమెరికా వీసా కోసం వెయిటింగ్ తగ్గించేలా.. భారతీయుల కోసం కొత్త రూల్

05 February 2023, 20:00 IST

    • US Visa New Rule: అమెరికా వీసా కోసం సుదీర్ఘ నిరీక్షణను తగ్గించేందుకు భారతీయుల కోసం ఓ కొత్త నిబంధన అమలులోకి వచ్చింది. ఇండియాలో అమెరికన్ ఎంబసీ ఈ విషయాన్ని ప్రకటించింది.
US Visa New Rule: అమెరికా వీసా కోసం వెయిటింగ్ తగ్గించేలా.. భారతీయుల కోసం కొత్త రూల్
US Visa New Rule: అమెరికా వీసా కోసం వెయిటింగ్ తగ్గించేలా.. భారతీయుల కోసం కొత్త రూల్ (HT Photo)

US Visa New Rule: అమెరికా వీసా కోసం వెయిటింగ్ తగ్గించేలా.. భారతీయుల కోసం కొత్త రూల్

US Visa New Rule: అమెరికా వీసా కోసం అపాయింట్‍మెంట్ కావాలంటే ఇండియాలో దాదాపు 500 రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొన్ని కేటగిరీల వీసాకు ఈ సుదీర్ఘ నిరీక్షణ తప్పడం లేదు. ఈ వెయిటింగ్ పీరియడ్ (US Visa Waiting Period) కష్టాలు వీసా దరఖాస్తుదారులకు ఇబ్బందిగా మారాయి. ఈ తరుణంలో ఇండియాలోని యూఎస్ ఎంబసీ (US Embassy in India) కొత్త రూల్ తీసుకొచ్చింది. విదేశాలకు ప్రయాణించే భారతీయులు.. ఆ దేశాల్లోని అమెరికా ఎంబసీ, కాన్సులేట్‍లో వీసా అపాయింట్‍మెంట్ పొందే అవకాశం తీసుకొచ్చినట్టు తెలిపింది. థాయ్‍ల్యాండ్‍ను ఉదారహణగా పేర్కొంది. థాయ్‍ల్యాండ్‍కు వెళ్లే భారతీయులు .. బీ1, బీ2 వీసా అపాయింట్‍మెంట్లు అక్కడ పొందవచ్చని, ఆ దేశం అపాయింట్‍మెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉందని యూఎస్ ఎంబసీ వెల్లడించింది. వివరాలివే..

US Visa New Rule: “మీరు అంతర్జాతీయ ట్రావెల్ చేయనున్నారా? ఒకవేళ అవును అయితే, ఆ గమ్యస్థానం(ఆ దేశం)లోని యూఎస్ ఎంబసీ, కాన్సులేట్‍లో మీరు వీసా అపాయింట్‍మెంట్‍ను పొందే అవకాశం ఉండొచ్చు. ఉదాహరణకు రానున్న నెలల్లో థాయ్‍ల్యాండ్‍కు వెళ్లే భారతీయులకు బ్యాంకాక్‍లోని యూఎస్ ఎంబసీలో బీ1, బీ2 అపాయింట్‍మెంట్ కెపాసిటీ ఉంది” అని ఇండియాలో యూఎస్ ఎంబసీ ట్వీట్ చేసింది.

కొత్త విధానాలు

US Visa for Indians: వీసాల జారీ ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించేందుకు అమెరికా ఇటీవల కొన్ని కొత్త విధానాలను అనుసరిస్తోంది. తొలిసారి వీసా కోసం అప్లై చేసుకున్న వారికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేస్తోంది. ఎంబసీలో సిబ్బంది సంఖ్యను పెంచుతోంది. సుదీర్ఘ కాలంగా ఉన్న వీసా బ్యాక్‍ల్యాగ్‍లను క్లియర్ చేసేందుకు ఢిల్లీలోని యూఎస్ ఎంబసీ, ముంబై, చెన్నై, కోల్‍కతా, హైదరాబాద్‍లోని కాన్యులేట్లు జనవరి 21న “స్పెషల్ సాటర్‌డే (శనివారం) ఇంటర్వ్యూ డేస్”ను నిర్వహించాయి.

US Visa for Indians: ఇండియాలో వీసా వెయిట్ టైమ్‍ను తగ్గించేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తున్నామని యూఎస్ వీసా ఆఫీసర్ ఒకరు పేర్కొన్నారు. అదనపు కౌన్సిల్ ఆఫీసర్లను భారత్‍కు పంపడం, వేరే దేశాల్లోని ఎంబసీల్లో భారత వీసా దరఖాస్తుదారులకు అవకాశం కల్పించడం లాంటి చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు.

కొవిడ్-19 సంబంధిత రవాణా ఆంక్షలు తొలగిపోయాక అమెరికా వీసాల కోసం భారత్‍ నుంచి అధిక సంఖ్యలో దరఖాస్తులు నమోదయ్యాయి. దీంతో బీ1(బిజినెస్), బీ2(టూరిస్ట్) కేటగిరీల కింద దరఖాస్తు చేసుకున్న వారికి ఏకంగా గత ఏడాది అక్టోబర్‌లో సుమారు మూడు సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంది. అయితే దీన్ని తగ్గించేందుకు అమెరికన్ ఎంబసీ విభిన్న ప్రయత్నాలు చేస్తోంది.