తెలుగు న్యూస్  /  National International  /  Trs To Brs Will Kcrs Name-change Gamble Pay Off?

TRS to BRS: పేరు మార్పుతో దశ తిరుగుతుందా? కేసీఆర్ సాధించేదేంటి?

HT Telugu Desk HT Telugu

05 October 2022, 15:48 IST

  • TRS to BRS: పేరు మార్పుతో కేసీఆర్ ఆశించిన లక్ష్యం నెరవేరుతుందా?

పార్టీ పేరు మార్చే ముందు కేసీఆర్‌ను కలిసిన జేడీఎస్ నేత కుమారస్వామి తదితరులు
పార్టీ పేరు మార్చే ముందు కేసీఆర్‌ను కలిసిన జేడీఎస్ నేత కుమారస్వామి తదితరులు (ANI Picture Service)

పార్టీ పేరు మార్చే ముందు కేసీఆర్‌ను కలిసిన జేడీఎస్ నేత కుమారస్వామి తదితరులు

న్యూఢిల్లీ, అక్టోబరు 5: టీఆర్‌ఎస్‌ పార్టీ పేరును మార్చి జాతీయ రాజకీయాల్లోకి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రయత్నాన్ని రాజకీయ పండితులు నిశితంగా గమనిస్తున్నారు. కొందరు దీనిని జాతీయ స్థాయిలో అతని స్థాయిని పెంచడంలో సహాయపడే చర్యగా చూస్తుండగా, మరికొందరు ఇది దురదృష్టకరంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.

ప్రాంతీయ రాజకీయ దృశ్యంలో రాజకీయంగా ముఖ్యమైన పరిణామం ఇది. రెండు దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)కి బుధవారం భారత రాష్ట్ర సమితి (BRS)గా నామకరణం చేశారు. జాతీయ నాయకుడిగా నిలదొక్కుకునే లక్ష్యంతో పార్టీ పేరు మర్చారు.

హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో పార్టీ నేతలు హర్షధ్వానాలు చేశారు. ‘దేశ్‌ కా నేత కేసీఆర్‌’, ‘డియర్‌ ఇండియా, ఆయన వస్తున్నారు’ అనే నినాదాలతో కూడిన బ్యానర్లు సమావేశం జరిగిన స్థలం చుట్టూ ప్రదర్శించారు.

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ బలపడుతుండడంతో జాతీయ సమస్యలపై దృష్టి సారించడం ద్వారా ఆ పార్టీని ఎండగడుతూ రాష్ట్రంలో తన పార్టీని మరింత బలోపేతం చేసుకునే చర్యగా పలువురు అభివర్ణిస్తున్నారు.

అయితే, 2001లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో స్థాపించిన టీఆర్‌ఎస్ జాతీయ రాజకీయాల్లో తగిన చోటు చేజిక్కించుకోగలదా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరాదిలో కేసీఆర్ నాయకత్వాన్ని అంగీకరిస్తారా అనే అంశం ప్రశ్నార్థకంగా నిలుస్తోంది.

అయితే కేసీఆర్ కారణం లేకుండా పనులు చేసే రాజకీయ నాయకుడు కాదు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌పై విపరీతమైన వ్యతిరేకత లేకపోవడం వల్ల ఏర్పడిన శూన్యతను పూరించాలనే ఆశయం నుండి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే అతడి ప్రణాళిక ఏర్పడిందని ఒక రాజకీయ విశ్లేషకుడు చెప్పారు.

అనేక సంక్షేమ పథకాలతో మహిళలు, రైతులు, అణగారిన వర్గాల మద్దతును గెలుచుకోవడంలో తమ పార్టీ విజయం సాధించిందని 68 ఏళ్ల కేసీఆర్ నమ్ముతున్నారు.

కేసీఆర్ వ్యూహం ఫలిస్తుందా?

కేసీఆర్ అమలు చేస్తున్న కొన్ని ప్రధాన పథకాల్లో రైతు బంధు, దళిత బంధు, కేసీఆర్‌ కిట్‌, పేదలందరికీ ఆసరా’ పింఛన్లు ప్రధానమైనవి.

టిఆర్‌ఎస్ పేరును మార్చి దానిని "జాతీయ" పార్టీగా బలోపేతం చేయడం ద్వారా 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించడంపై దృష్టి సారిస్తున్నారు.

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ దేశ ఎన్నికల రాజకీయాలలో తన స్థితిని మార్చుకునేందుకు విఫలయత్నం చేస్తున్న తరుణంలో, దేశవ్యాప్తంగా ప్రధాన ప్రాంతీయ పార్టీలు అధికార బీజేపీని ఎదుర్కోగల ఐక్య ఫ్రంట్‌ను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రతిపక్షం అనే ఆలోచనను చాలా కాలంగా సమర్థిస్తున్న కేసీఆర్, అలాంటి కూటమిలో కీలక పాత్ర పోషించాలనుకుంటున్నారు.

అయితే, అందరూ ఆ ఆశావాదాన్ని విశ్వసించడం లేదు. తెలంగాణ జనసమితి వ్యవస్థాపకుడు, రాజకీయ విశ్లేషకుడు ఎం.కోదండరామ్‌ దీనిపై స్పందిస్తూ ‘రాష్ట్రంలో గుర్తింపు పొందిన టీఆర్‌ఎస్‌ వంటి పార్టీ తొలిసారిగా బీఆర్‌ఎస్‌గా పేరు మార్చుకోవడం దురదృష్టకరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బలమైన ఉనికిని కలిగి ఉన్న తెలుగుదేశం పార్టీ (టిడిపి) రిజిస్టర్డ్ జాతీయ పార్టీ. అయితే జాతీయ స్థాయిలో ఎటువంటి పురోగతి సాధించలేదు. ఎంఐఎం విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది..’ అని ఆయన అన్నారు. టీడీపీ, ఏఐఎంఐఎం రెండూ తమ పార్టీల పేర్లను మార్చుకోలేదన్నారు.

‘కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రిగా గుర్తింపు ఉంది, కానీ జాతీయ పార్టీని నిర్మించడానికి అది సరిపోదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో బీజేపీ తన రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ జాతీయ అంశాలపై దృష్టి మరల్చాలనుకుంటున్నారని మరో విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.

అతను నేరుగా జాతీయ రంగంలోకి దిగడం "జూదం"గా ప్రసిద్ధ కౌటిల్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కెఐపిపి)కి చెందిన విశ్లేషకుడు ఒకరు అభివర్ణించారు.

ప్రాంతీయ శక్తుల ఆవిర్భావంతో 1980ల తర్వాత దేశ రాజకీయాలు మారిన దృష్ట్యా, సమాజ్‌వాదీ, బీఎస్పీ, ఆర్జేడీ, జేడీయూ, డీఎంకే ఇతర పార్టీలు కూటమి నిర్మాణం ద్వారా జాతీయ పాత్ర పోషిస్తున్నాయి.

వ్యక్తిగతంగా చిన్న ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో తమను తాము సమర్థవంతంగా నిలబెట్టుకోలేకపోయాయి. అయితే ఉమ్మడిగా వారు సాంప్రదాయ ప్రతిపక్షాన్ని బలీయమైన ప్రతిపక్షంగా మార్చగలరనే సెంటిమెంట్‌పై పనిచేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.

ఇటీవలి కాలంలో కేసీఆర్ జేడీఎస్ చీఫ్ హెచ్‌డి దేవెగౌడ, ఎన్సీపీ నేత శరద్ పవార్, టీఎంసీ నేత మమతా బెనర్జీ, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, ఇతరులతో సహా పలువురు ప్రాంతీయ పార్టీల నాయకులను కలుసుకున్నారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారు. అయితే, ఈ పార్టీలలో చాలా వరకు కాంగ్రెస్ లేకుండా ఐక్య ప్రతిపక్షం ఉండదని, అలాంటి చర్య బీజేపీకి మాత్రమే సహాయం చేయగలదని అభిప్రాయపడ్డాయి.

కేసీఆర్ జాతీయ ఆకాంక్షల గురించి రాజకీయ వ్యాఖ్యాత కె.రామచంద్ర మూర్తి మాట్లాడుతూ, జాతీయ నాయకులను చేర్చుకోవడం లేదా చిన్న పార్టీలను విలీనం చేయడం జాతీయ పార్టీగా మారడానికి ఒక మార్గమని అన్నారు.

‘అయితే, ఏ పార్టీ కూడా టీఆర్‌ఎస్‌లో విలీనానికి ఆసక్తి చూపుతుందని నేను అనుకోవడం లేదు. జేడీఎస్ కూడా అలా చేయదు. పొత్తు మాత్రమే ఉంటుంది. గుజరాత్‌లో కూడా ఓ మాజీ సీఎం వచ్చి టీఆర్‌ఎస్ అధినేతను కలిశారు. ఆయన మిత్రపక్షంగా ఉండొచ్చు..’ అని విశ్లేషించారు.

కేసీఆర్ ఎత్తుగడపై కొందరు రాజకీయ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేఐపీపీ నుండి మరొక విశ్లేషకుడు స్పందిస్తూ ‘ఎవరైనా వచ్చి రాజకీయ ప్రత్యామ్నాయం గురించి ఆలోచించొచ్చు. వారు గెలుస్తారో లేదో ఎవరికి తెలుసు?’ అని విశ్లఏసించారు.

ఇది జాతీయ స్థాయిలో కేసీఆర్‌కు "ముఖ్యమైన ప్రయోజనాన్ని" తీసుకురావచ్చు లేదా తీసుకురాకపోవచ్చు. కానీ ఇది ఖచ్చితంగా ప్రాంతీయ స్థాయి నుండి జాతీయ నాయకుడి వరకు "తన ఇమేజ్‌ని మెరుగుపరచడానికి" సహాయపడుతుంది. తద్వారా తెలంగాణలో అతడి, అతడి పార్టీ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సహాయపడుతుంది. బీజేపీ చేపట్టిన ‘ఆపరేషన్ తెలంగాణ’ను ఎదుర్కోవడానికి ఇది బలమైన ఎత్తుగడ అవుతుందని విశ్లేషకులు పేర్కొన్నారు.

జాతీయ స్థాయిలో ఫలితంతో సంబంధం లేకుండా, అతను కోల్పోయేది ఏమీ లేనందున ఇది విన్-విన్ సిచ్యుయేషన్‌ అవుతుందని విశ్లేషకులు తెలిపారు.

తన జాతీయ ఆశయాలను సాధించేందుకు కేసీఆర్ దళితులు, గిరిజనులు, రైతుల ఓట్లను కూడా ఆకట్టుకుంటున్నారు. తన రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచారు.

కేసీఆర్ 2020-21లో ఢిల్లీ-హర్యానా సరిహద్దులో జరిగిన ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన ఢిల్లీ, పంజాబ్‌కు చెందిన కొంతమంది రైతుల కుటుంబ సభ్యులకు ఆర్థికంగా సహాయం చేశారు. తనను తాను రైతు అనుకూల నాయకుడిగా చెప్పుకునే ప్రయత్నం చేశారు.

ఎంఐఎంతో సన్నిహితంగా ఉన్నందున అతడు ముస్లిం అనుకూల నాయకుడిగా కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఆయన మంత్రివర్గంలో చాలా మంది మంత్రులు ముస్లింలు కూడా ఉన్నారు.

ముస్లిం అనుకూల, బీజేపీ వ్యతిరేక ఓట్లు ఆయనకు రావచ్చని ఒక విశ్లేషకుడు చెప్పారు. దేశంలో 14 శాతం ముస్లిం ఓటు బ్యాంకు కూడా ఉంది.

టాపిక్