తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Covid Vaccine: కోవిడ్ టీకా రూపొందించిన టాప్ సైంటిస్ట్ దారుణ హత్య..

Covid vaccine: కోవిడ్ టీకా రూపొందించిన టాప్ సైంటిస్ట్ దారుణ హత్య..

HT Telugu Desk HT Telugu

04 March 2023, 15:13 IST

  • Top scientist behind Russia's Sputnik V Covid vaccine mudered: రష్యాలో స్పుత్నిక్ వీ (Sputnik V) కోవిడ్ వ్యాక్సిన్ ను రూపొందించడంలో కీలక పాత్ర వహించిన టాప్ సైంటిస్ట్ దారుణ హత్యకు గురయ్యారు. 

హత్యకు గురైన సైంటిస్ట్ యాండ్రీ బొటికోవ్ (ఫైల్ ఫొటో)
హత్యకు గురైన సైంటిస్ట్ యాండ్రీ బొటికోవ్ (ఫైల్ ఫొటో)

హత్యకు గురైన సైంటిస్ట్ యాండ్రీ బొటికోవ్ (ఫైల్ ఫొటో)

Top scientist behind Russia's Sputnik V Covid vaccine mudered: కొరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి రష్యా రూపొందించిన టీకా స్పుత్నిక్ వీ (Sputnik V). దీన్ని రూపొందించిన ప్రధాన శాస్త్రవేత్తల బృందంలో యాండ్రీ బొటికోవ్ (Andrey Botikov) కూడా ఒకరు. ఆయన శుక్రవారం తన అపార్ట్ మెంట్ లో విగతజీవిగా కనిపించారు.

ట్రెండింగ్ వార్తలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Top scientist mudered: బెల్ట్ గొంతుకు బిగించి..

స్పుత్నిక్ వీ (Sputnik V) టీకా రూపకల్పనలో ముఖ్య పాత్ర పోషించిన యాండ్రీ బొటికోవ్ (Andrey Botikov) తన అపార్ట్ మెంట్ లో చనిపోయి కనిపించారు. గొంతుకు బెల్ట్ బిగించి, ఊపిరాడకుండా చేసి ఆయనను హతమార్చారు. ఈ నేరానికి సంబంధించి ఒక వ్యక్తిని అనుమానితుడిగా పోలీసులు అరెస్ట్ చేశారు. గేమాలెయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ లో యాండ్రీ బొటికోవ్ (Andrey Botikov) సీనియర్ రీసెర్చర్ గా పని చేస్తున్నారు. ఇక్కడే రష్యా కోవిడ్ టీకా స్పుత్నిక్ వీ (Sputnik V) రూపొందింది. ఈ టీకా రూపకల్పనలో యాండ్రీ బొటికోవ్ (Andrey Botikov) కీలక పాత్ర పోషించారు. టీకా ను అభివృద్ధి చేయడంలో చేసిన సేవలకు గానూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) చేతుల మీదుగా యాండ్రీ బొటికోవ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఫర్ ద ఫాదర్ లాండ్ (Order of Merit for the Fatherland) పురస్కారాన్ని కూడా పొందారు. స్పుత్నిక్ వీ (Sputnik V) టీకాను అభివృద్ధి చేయడంలో కీలక భూమిక పోషించిన 18 మంది సైంటిస్టుల్లో యాండ్రీ బొటికోవ్ కూడా ఒకరు.

police investigation: పోలీసుల దర్యాప్తు

స్పుత్నిక్ వీ (Sputnik V) టీకా అభివృద్దిలో కీలకంగా వ్యవహరించిన సైంటిస్ట్ యాండ్రీ బొటికోవ్ (Andrey Botikov) హత్యను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి హంతకుల కోసం గాలిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి ఒక అనుమానితుడిని అరెస్ట్ చేశారు. అతడు ఈ నేరం చేసినట్లుగా ఒప్పుకున్నట్లు సమాచారం. ప్రాథమికంగా సేకరించిన సమాచారం మేరకు.. 29 ఏళ్ల ఒక యువకుడు యాండ్రీ బొటికోవ్ (Andrey Botikov)ను గొంతుకు బెల్ట్ బిగించి చంపేశాడు. అయితే, ఈ హత్యకు కచ్చితమైన కారణమేంటో ఇంకా తెలియరాలేదు. ఇద్దరి మధ్య గొడవ జరిగి, క్షణికావేశంలో హత్య చేసి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ