తెలుగు న్యూస్  /  National International  /  Telangana Rains, Heavy Downpour Likely In These Places For The Next 5 Days

Telangana rains : ఈ ప్రాంతాల్లో ఐదు రోజుల వరకు భారీ వర్షాలు..!

Livemint HT Telugu

28 August 2022, 16:22 IST

    • Heavy rainfall alert : తెలంగాణ సహా వివిధ ప్రాంతాల్లో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు పడతాయి. ఈ వివరాలను ఐఎండీ వెల్లడించింది.
రానున్న ఐదు రోజుల్లో.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
రానున్న ఐదు రోజుల్లో.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. (AFP)

రానున్న ఐదు రోజుల్లో.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

Heavy rainfall alert : దేశవ్యాప్తంగా రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ- రాయలసీమతో పాటు ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో ఈ నెల 28-29 మధ్య భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్​ తీర ప్రాంతంలో 29 వరకు, దక్షిణ కన్నడతో పాటు తీర ప్రాంతాల్లో 31వరకు అతి భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. తమిళనాడు, కేరళ, మాహేలో సైతం ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

ICSE exam results 2024 : త్వరలో ఐసీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

ఐఎండీ ప్రకారం.. నాగాలాండ్​, మణిపూర్​, మిజోరాం, త్రిపురలో ఆగస్టు 28,29, సెప్టెంబర్​ 1 విస్తృతంగా వర్షాలు కురుస్తాయి. అరుణాచల్​ప్రదేశ్​, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి.

Telangana rains : ఇక బిహార్,​ ఉత్తర్​ప్రదేశ్​లో ఈ నెల 28-29న, ఝార్ఖండ్​లో 28న, పశ్చిమ్​ బెంగాల్​, సిక్కింలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపుల శబ్దాలతో ఆయా ప్రాంతాలు దద్దరిల్లుతాయి.

దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నా.. ఢిల్లీలో మాత్రం ఎండలు ఉన్నాయి. ఆదివారం ఉదయం కూడా ఎండ ఉంది.