Telangana Rains: 3 రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్-weather updates of telangana over imd issued rain alert ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Weather Updates Of Telangana Over Imd Issued Rain Alert

Telangana Rains: 3 రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Mahendra Maheshwaram HT Telugu
Aug 27, 2022 06:19 PM IST

Rains in Telangana: తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన జారీ చేసింది.

తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణకు వర్ష సూచన

Rain alert for Telangana:పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర-దక్షిణ ద్రోణి ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్టల్‌ ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు మీదుగా సగటు సముద్రమట్టం నుంచి 1.5కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుందని వివరించింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుసే అవకాశం ఉందని పేర్కొంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతారణ శాఖ తెలిపింది. ఇవాళ చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని.. రేపు, ఎల్లుండి అనేకచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

భదాద్రికొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబాబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

ఇక హైదరాబాద్ లో ఆకాశం సాధారణంగా మేఘావృత్తమైన ఉంటుందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య ఉత్తర దిశల నుంచి గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

ఉత్తర భారతం విలవిల

Heavy rainfall alert : గత వారం.. భారీ వర్షాలతో అల్లాడిపోయిన ఉత్తరాఖండ్​, ఒడిశా ప్రజలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) పిడుగులాంటి వార్తను ఇచ్చింది. ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యెల్లో అలర్ట్​ జారీ చేసింది. అదే సమయంలో.. రాజస్థాన్​లో వర్షాలు కాస్త శాంతించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

మహానది, సురనరేఖ నదుల ఉద్ధృతి వల్ల ఏర్పడిన వరదల నుంచి ఒడిశా ఇంకా కోలుకోలేదు. కాగా.. ఇప్పుడు శనివారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మయూర్​భంజ్​, బాలాసోర్​, కియోఝర్​, కటక్​, జైపూర్​, భద్రక్​, బౌధ్​, నయాగఢ్​, ఖుర్ద, రాయగడ, కోరపుట్​, మల్కన్​గిరి, నబరంగ్​పూర్​, గజపతి, గంజమ్​, అంగుల్​లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతూ.. యెల్లో అలర్ట్​ని ఇచ్చింది.

Rains in India : బిహార్​లో సైతం.. శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. ఝార్ఖండ్​లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం.. ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఉత్తర్​ప్రదేశ్​లోని అనేక ప్రాంతాల్లో ఈ నెల 30 వరకు ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయి. వర్షాలకు ఇప్పటికే.. ఆ రాష్ట్రంలోని 650 గ్రామాలు నీటమునిగాయి.

ఉత్తరాఖండ్​లో.. మంగళవారం వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ప్రకృతి విపత్తు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో.. జాతీయ విపత్త నిర్వహణ దళం నిత్యం అప్రమత్తంగా ఉంటోంది. కొన్ని రోజుల క్రితమే.. ఉత్తరాఖండ్​లోని అనేక ప్రాంతాలు ఆకస్మిక వరదలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి.

మరోవైపు.. కొన్ని రోజులుగా.. రాజస్థాన్​లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. ఝాల్వార్​, బుంది, కోటా ప్రాంతాల్లో వరద పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కాగా.. రానున్న రోజుల్లో వర్షాల ప్రభావం తగ్గుతుందని ఐఎండీ పేర్కొంది. వివిధ ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడతాయని వివరించింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం