Rain alert : ఆ ప్రాంతాలకు 'రెడ్​ అలర్ట్​'.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు!-red alerts issued in these states till tomorrow key updates from imd here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rain Alert : ఆ ప్రాంతాలకు 'రెడ్​ అలర్ట్​'.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు!

Rain alert : ఆ ప్రాంతాలకు 'రెడ్​ అలర్ట్​'.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు!

Sharath Chitturi HT Telugu
Aug 20, 2022 03:58 PM IST

Rain alert : దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు పడుతున్నాయి. కాగా.. ఒడిశా, మధ్యప్రదేశ్​తో పాటు ఇతర ప్రాంతాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. ఈ మేరకు ఐఎండీ రెడ్​ అలర్ట్​ సైతం జారీ చేసింది.

ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. రెడ్​ అలర్ట్​ జారీ చేసిన ఐఎండీ
ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. రెడ్​ అలర్ట్​ జారీ చేసిన ఐఎండీ (AFP)

Rain alert : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. మరో 24 గంటల్లో బలహీనపడుతుందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. కాగా.. అల్పపీడనం ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

అల్పపీడన ద్రోణి ప్రస్తుతం దక్షిణ ఝార్ఖండ్​- ఉత్తర ఒడిశాపై అలుముకుందని, మరికొన్ని గంటల్లో అది వాయువ్య ఝార్ఖండ్​- ఉత్తర ఛత్తీస్​గఢ్​- ఉత్తర మధ్యప్రదేశ్​వైపు ప్రయాణిస్తుందని ఐఎండీ స్పష్టం చేసింది.

ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

శనివారం.. తూర్పు మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 21న.. పశ్చిమ మధ్యప్రదేశ్​లోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి. 22న తూర్పు రాజస్థాన్​లో వర్షాలు కురుస్తాయి.

Odisha rains : శనివారం.. ఝార్ఖండ్​, ఒడిశా, విదర్భా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, శని-ఆదివారాలు రాజస్థాన్​లో భారీ వర్షాలు కురుస్తాయి. పశ్చిమ మధ్యప్రదేశ్​- పశ్చిమ రాజస్థాన్​ ప్రాంతాల్లో ఈ నెల 22, గుజరాత్​లోని కొన్ని చోట్ల ఈ నెల 23 ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి.

శనివారం.. గ్యాంగ్​టిక్​ పశ్చిమ్​ బెంగాల్​, ఆదివారం.. కోంకణ్​- గోవా ప్రాంతాల్లో, 23న తూర్పు- పశ్చిమ రాజస్థాన్​లో, 24న గుజరాత్​లోని ఉత్తర ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువ పడతాయి.

<p>ఆయా ప్రాంతాల్లో వర్షాలపై ఐఎండీ చేసిన ప్రకటన</p>
ఆయా ప్రాంతాల్లో వర్షాలపై ఐఎండీ చేసిన ప్రకటన (Twitter/ IMD)
  • జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​, గిల్గిత్​, బల్తిస్థాన్​, ముజాఫరాబాద్​లో శనివారం, హిమాచల్​ప్రదేశ్​లో 20-24 వరకు, ఉత్తర్​ప్రదేశ్​లో 20-24వ తేదీ వరకు, 22న పంజాబ్​లో, 221-22న హరియాణాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
  • అసోం, మేఘాలయా, నాగాలాండ్​, మణిపూర్​, మిజోరాం, త్రిపురలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 22-23న భారీ వర్షాలు పడతాయి.
  • కర్ణాటక తీర, దక్షిణ ప్రాంతాల్లో 22-24 మధ్యలో, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్​లో ఈ నెల 23-24న భారీ వర్షాలు తప్పవు.
  • ఈ నెల 24న కేరళలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి.
  • వర్షాల అంచనాలకు తగ్గట్టుగా.. ఆయా ప్రాంతాలకు రెడ్​ అలర్ట్​ జారీ చేసింది ఐఎండీ.

ఉత్తర భారతం విలవిల..

Himachal Pradesh flash floods : మరోవైపు భారీ వర్షాలు, ఆకస్మిక వరదలకు ఉత్తర భారతం విలవిలలాడుతోంది. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హిమాచల్​ ప్రదేశ్​, ఉత్తరాఖండ్​ ప్రజలు భయపడిపోతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అనేక నదులు ఉద్ధృతంగా ప్రవహిస్త్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి.

ఆకస్మిక వరదల నేపథ్యంలో జమ్ముకశ్మీర్​లోని వైష్ణోదేవీ యాత్ర కొన్ని గంటల వరకు నిలిపివేశారు అధికారులు.

ఉత్తర భారతంలో వర్షాలు సృష్టించిన అలజడులపై ప్రత్యేక కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

హిమాచల్​ ప్రదేశ్​లో తాజా పరిస్థితులపై దృశ్యమాలిక కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం