Rains in India : భారీ వర్షాలు- ఆకస్మిక వరదలతో ఉత్తర భారతం విలవిల!-rains in india flash floods hit various parts of himachal pradesh and uttarakhand ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rains In India : భారీ వర్షాలు- ఆకస్మిక వరదలతో ఉత్తర భారతం విలవిల!

Rains in India : భారీ వర్షాలు- ఆకస్మిక వరదలతో ఉత్తర భారతం విలవిల!

Sharath Chitturi HT Telugu
Aug 20, 2022 01:19 PM IST

Rains in India : భారీ వర్షాలతో ఉత్తర భారతం గడగడలాడుతోంది. హిమాచల్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఒక్క హిమాచల్​ ప్రదేశ్​లోనే ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

<p>జమ్ముకశ్మీర్​లో కుప్పకూలిన ఓ నివాసం</p>
జమ్ముకశ్మీర్​లో కుప్పకూలిన ఓ నివాసం (ANI)

Rains in India : అటు భారీ వర్షాలు, ఇటు ఆకస్మిక వరదలతో ఉత్తర భారతం విలవిలలాడుతోంది. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా.. జమ్ముకశ్మీర్​, హిమాచల్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​, ఉత్తర్​ప్రదేశ్​లలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఉత్తరాఖండ్​లో..

భారీ వర్షాల నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున.. ఉత్తరాఖండ్​ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. డెహ్రాడూన్​ జిల్లాలోని రాయ్​పూర్​- కుమల్డా ప్రాంతంలో ఎటుచూసినా వరద నీరే కనిపిస్తోంది. నదులు ఉద్ధృతంగా పొంగి పొర్లుతున్నాయి. సాంగ్​నదిపై ఉన్న బ్రిడ్జ్​ ఒకటి.. కొట్టుకుపోయింది. ముస్సౌరిలోని పర్యాటక ప్రదేశాలు నీటితో నిండిపోయాయి.

Uttarakhand flash floods : అనేక గ్రామాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి నీటితో పాటు మట్టి కూడా వచ్చి చేరింది. మాల్దేవత, భూట్సి, తౌలియాకటల్​, తాత్యూద్​, లవర్ఖ, రింగల్​గాధ్​, దత్తు, రగడ్​ గావౌ, సార్కెట్​తో పాటు అనేక ప్రాంతాలు ముప్పులో కూరుకుపోయాయి.

రంగంలోకి దిగిన ఎస్​డీఆర్​ఎఫ్​ బృందం.. సహాయక చర్యలు చేపట్టింది. ప్రతికూల వాతావరణ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్టు సమాచారం.

పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడిన ఘటనలు నమోదయ్యాయి. శిథిలాలు పేరుకుపోవడంతో రాయ్​పూర్​- కుమల్దా రోడ్డు సేవలు నిలిచిపోయాయి.

రటోటాగఢి వద్ద రిషికేష్​- బద్రినాథ్​ హైవే బ్లాక్​ అయ్యింది.

హిమాచల్​ ప్రదేశ్​..

హిమాచల్​ ప్రదేశ్​ను సైతం భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వేరువేరు ప్రమాద ఘటనల్లో ఇప్పటికే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 13మంది మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

హమీర్​పూర్​ జిల్లాలో ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న 22మందిని సహాయక సిబ్బంది రక్షించారు.

Himachal Pradesh flash floods : చంబా జిల్లాలో భారీ వర్షాలకు ఓ ఇల్లు కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మండి జిల్లాలో.. ఓ బాలిక వరదల్లో కొట్టుకుపోయింది. ఆమె మృతదేహాన్ని, తన ఇంటి నుంచి 500 మీటర్ల దూరంలో గుర్తించారు.

వరద ఉద్ధృతి తీవ్రంగా ఉన్న బాఘి ప్రాంతం నుంచి అనేక కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోయాయి.

కిషన్​ గ్రామంలో కొండ చరియలు విరిగి పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరణించారని సమాచారం.

<p>చక్కీ నదిపై విరిగిపోయిన రైల్వే బ్రిడ్జ్​</p>
చక్కీ నదిపై విరిగిపోయిన రైల్వే బ్రిడ్జ్​ (ANI)

కాంగ్రా లోయలో చక్కీ నదిపై ఉన్న ఓ రైల్వే బ్రిడ్జ్​.. వరదల కారణంగా కొట్టుకుపోయింది. పతాన్​కోట్​- మండి జాతీయ రాహదారిలో కొండచరియలు విరిగిపడటంతో.. ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

జమ్ముకశ్మీర్​..

జమ్ముకశ్మీర్​ వర్షాల ధాటికి.. ఉధమ్​పూర్​ జిల్లాలోని సమోలి గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనతో ఓ ఇల్లు కుప్పకూలింది. ఈ ప్రమాదం ఇద్దరు చిన్నారులు మరణించారు. ఘటనాస్థలానికి పరుగులు తీసిన సహాయక సిబ్బంది.. మృతదేహాలను వెలికితీశారు.

<p>ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లో గంగా నదీ తీరం</p>
ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లో గంగా నదీ తీరం (ANI)

ఆకస్మిక వరదల కారణంగా వైష్ణోదేవీ యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఒడిశా..

Odisha rains : అల్పపీడన ప్రభావంతో ఒడిశాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా.. వేరువేరు ప్రాంతాల్లో కొండచరియలు, గోడలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి. ఆయా ఘటనల్లో ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు.

భారీ వర్షాలకు వేలాది ఎకరాల పంట భూమి నీట మునిగింది. 24 గంటల వ్యవధిలో 88 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. బాలాసోర్​ జిల్లాలోని భోగ్రాయి ప్రాంతంలో ఏకంగా 226ఎంఎంల వర్షపాతం నమోదైంది.

<p>ఒడిశాలో పరిస్థితి ఇలా..</p>
ఒడిశాలో పరిస్థితి ఇలా.. (ANI)
Whats_app_banner

సంబంధిత కథనం