TSRTC : హైదరాబాద్‌లో 1932 నాటి బస్సు.. అప్పట్లో ఎలా నడిచిందంటే?-tsrtc organize grand bus parade on tank bund with 1932 nizam king s bus ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc : హైదరాబాద్‌లో 1932 నాటి బస్సు.. అప్పట్లో ఎలా నడిచిందంటే?

TSRTC : హైదరాబాద్‌లో 1932 నాటి బస్సు.. అప్పట్లో ఎలా నడిచిందంటే?

HT Telugu Desk HT Telugu
Aug 14, 2022 03:31 PM IST

టీఎస్ఆర్టీసీ నిర్వహించిన గ్రాండ్ బస్ పరేడ్ లో ఓ బస్సు అందరి దృష్టిని ఆకర్శించింది. 1932 కాలంనాటి నిజాం బస్సు రోడ్డు మీదకు వచ్చింది. అప్పట్లో ఇలాంటి బస్సులే నడిపేవారు.

నిజాం కాలం నాటి బస్
నిజాం కాలం నాటి బస్

టీఎస్ఆర్టీసీ నిర్వహించిన బస్ ర్యాలీలో యూకేకు చెందిన అల్బియాన్ కంపెనీ తయారు చేసిన నిజాం కాలం నాటి బస్సు ఆకట్టుకుంది. 1932లో నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ (ఎన్ఎస్ఆర్ఆర్టిడి) 27 బస్సుల ప్రవేశపెట్టింది. మొదటి ఫ్లీట్లో భాగమైన రెడ్ కలర్ బస్సు మరమ్మతులు చేసి జాతీయ జెండాలతో అలంకరించి రోడ్డు మీదకు తెచ్చారు. ఇందులో 19 మంది కూర్చొవచ్చు. అప్పుడు నాందేడ్ వెళ్లేది. నేమ్ ప్లేట్ కూడా అలానే ఉంది.

నగరంలో బస్ ర్యాలీ నిర్వహించారు. అందరి దృష్టి ఈ బస్సు మీదకే వెళ్లింది. టీఎస్ ఆర్టీసీ ఏర్పడినప్పుడు విలువైన ఈ బస్సును భద్రపరిచారు. బస్ భవన్ వెలుపల ఈ బస్సును ప్రదర్శనకు పెట్టారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చేస్తున్న వేడుకల్లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ బస్సును బయటకు తీశారు. ట్యాంక్‌బండ్‌ మీద అల్లూరి విగ్రహం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం దాకా పరేడ్‌ నిర్వహించారు.

1932 ఏప్రిల్‌ 18న HYZ 223 అనే నంబరుతో రిజిస్టర్‌ అయి ఉన్నట్టుగా కనిపిస్తుంది. బస్సు పై భాగంలో ఎన్‌ఎస్ఆర్‌ఆర్‌టీడీ(నిజాం రాష్ట్ర రైల్వే రోడ్డు రవాణాశాఖ) పేరు ఉంది. అప్పట్లో 27 బస్సులను లండన్‌ నుంచి ముంబయి ప్రత్యేక ఓడల్లో తెప్పించారు. అక్కడి నుంచి డ్రైవర్లు రోడ్డుమార్గంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈ బస్సులకు సెల్ఫ్‌ లేదు. వెనక నుంచి నెడితనే స్టార్ట్‌ అయ్యేది. తాజాగా పరేడ్‌ కోసం ఇంజినీర్లు ఈ బస్సుకి ఇంజిన్ మార్చారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం