తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rains In India: వర్షాలు, వరదలతో ఉత్తర భారతం విలవిల - 33 మంది మృతి

Rains in India: వర్షాలు, వరదలతో ఉత్తర భారతం విలవిల - 33 మంది మృతి

21 August 2022, 11:07 IST

  • flash floods in several state: భారీ వర్షాలు, వరదలతో ఉత్తర భారత వణికిపోతుంది. శనివారం నాటి లెక్కల ప్రకారం... 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్,  ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి.

ఉత్తరాధి రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు
ఉత్తరాధి రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు (HT)

ఉత్తరాధి రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు

Rains in India : అటు భారీ వర్షాలు, ఇటు ఆకస్మిక వరదలతో ఉత్తర భారతం వణికిపోతుంది. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా.. హిమాచల్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​, జార్ఖండ్, ఉత్తర్​ప్రదేశ్​, ఒడిశా పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. వరదల దాటికి 33 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

పలు రాష్ట్రాల్లో ఇలా…

ఒక్క హిమాచల్ ప్రదేశ్ లోనే 22 మంది మృతి చెందగా... మరో 8 మంది గల్లంతయ్యారు. వరదల దాటికి మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా లింక్ రోడ్లు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి.

ఉత్తరాఖాండ్ లో చూస్తే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ 10 మంది తప్పిపోయారు. వేలాది సంఖ్యలో స్థానిక ప్రజలు సొంత గ్రామాలను వదిలి వెళ్లాల్సి వచ్చింది. బ్రిడ్జిలు, డ్యామ్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని... సురక్షిత ప్రాణాలకు తరలిస్తున్నారు.

ఒడిశాలోనూ వరదల ఉద్ధృతి కొనసాగుతోంది. అధికారుల లెక్క ప్రకారం ఇప్పటి వరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు జిలాల్లో రెస్కూ టీమ్ లు చర్యలు చేపట్టాయి. శనివారం మహానదిలో 70 మందితో ప్రయాణిస్తున్న బోటు... బోల్తా పడింది. అందర్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. జార్ఖండ్ లో భారీగా చెట్లు నేల కూలాయి. కరెంట్ స్తంభాలు నేలకు ఒరగడంతో విద్యుత్ ను నిలిపివేశారు. గోడ కూలి ఓ మహిళ మృతి చెందింది.

పున:ప్రారంభం

Vaishnodevi Yatra: జమ్మూ కశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి యాత్ర ఇవాళ పున:ప్రారంభం కానుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా శనివారం సాయంత్రం నుంచి ఈ యాత్రను నిలిపివేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో యాత్రను ఆగస్టు 21 ఉదయం వరకు నిలిపివేసినట్లు మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు శనివారం తెలిపింది. మరోవైపు భారీగా పోలీసులను మోహరించారు.

ఇవాళ రేపు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

టాపిక్

తదుపరి వ్యాసం