తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sunny Leone's Pic On Hall Ticket: హాల్ టికెట్ పై సన్నీ లియోన్ ఫొటో

Sunny Leone's pic on hall ticket: హాల్ టికెట్ పై సన్నీ లియోన్ ఫొటో

HT Telugu Desk HT Telugu

08 November 2022, 23:25 IST

  • Sunny Leone's pic on hall ticket: విద్యార్థులను పరీక్షకు అనుమతించే హాల్ టికెట్ పై సన్నీ లియోన్ ఫొటో ఉండడం సంచలనం సృష్టించింది.

సన్నీ లియోన్ ఫొటోతో హాల్ టికెట్
సన్నీ లియోన్ ఫొటోతో హాల్ టికెట్

సన్నీ లియోన్ ఫొటోతో హాల్ టికెట్

Sunny Leone's pic on hall ticket: కర్నాటకలో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామక పరీక్ష సందర్భంగా ఈ వింత చోటు చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Sunny Leone's pic on hall ticket: సన్నీ లియోన్ ఫొటో

కర్నాటకలో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామక పరీక్ష రాయడానికి ఒక యువతి దరఖాస్తు చేసుకుంది. పరీక్ష ముందు హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకున్న ఆ యువతి దానిపై ఉన్న ఫొటోను చూసి ఒక్కసారిగా అవాక్కయింది. ఆ హాల్ టికెట్ పై తన ఫొటోకు బదులుగా ఫేమస్ సినీ స్టార్ సన్నీ లియోన్(Sunny Leone) ఫొటో ఉంది. అది కూడా అసభ్యకరంగా ఉంది. దీన్ని ఆ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా అది వైరల్ అయింది. దాంతో, ప్రభుత్వంపై విమర్శల వర్షం ప్రారంభమైంది.

Sunny Leone's pic on hall ticket: కాంగ్రెస్ ట్వీట్

ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ప్రభుత్వ తీరు ఇలా ఉందంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. కర్నాటక విద్యా శాఖ అసమర్ధతపై నిప్పులు చెరిగింది. అసెంబ్లీలో బ్లూ ఫిల్మ్ లు చూసే మంత్రులున్న ప్రభుత్వం నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలమని ఎద్దేవా చేసింది. అలాగే, ఈ అంశంపై కర్నాటక నెటిజనులు కూడా పెద్ద ఎత్తున స్పందించారు.

Sunny Leone's pic on hall ticket: ప్రభుత్వ స్పందన

దాంతో, కర్నాటక ప్రభుత్వం స్పందించింది. దీనిపై కర్నాటక విద్యా శాఖ వివరణ ఇచ్చింది. దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థి ఏ ఫొటో అప్ లోడ్ చేస్తే అదే ఫొటో ఆటోమేటిక్ గా హాల్ టికెట్ పై ప్రింట్ అవుతుందని వివరించింది. దరఖాస్తు సమయంలో కావాలనో, లేక పొరపాటునో సన్నీ లియోన్ ఫొటో అప్ లోడ్ అయి ఉండవచ్చని పేర్కొంది. మొత్తం ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించింది. అలాగే, శాఖాపరంగా అంతర్గత విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపింది. కాగా, ఈ విషయమై, ఆ యువతిని ప్రశ్నించగా, తన భర్త స్నేహితుడు తన దరఖాస్తును ఆన్ లైన్ లో ఫిలప్ చేశాడని వివరించింది.