తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Shraddha's Murder: శ్రద్ధ హత్య తరహాలోనే 12 ఏళ్ల క్రితం మరో భయానక హత్య..

Shraddha's murder: శ్రద్ధ హత్య తరహాలోనే 12 ఏళ్ల క్రితం మరో భయానక హత్య..

HT Telugu Desk HT Telugu

16 November 2022, 16:58 IST

  • Shraddha's murder: ఢిల్లీలో జరిగిన శ్రద్ధ వాకర్ హత్య తరహాలోనే 12 ఏళ్ల క్రితం డెహ్రాడూన్ లో ఒక కోల్డ్ బ్లడెడ్ మర్డర్ జరిగింది. ఈ రెండు హత్యల్లో కామన్ అంశాలు చాలా ఉన్నాయి. 

రాజేశ్ గులాటీ, అనుపమ గులాటీ (ఫైల్ ఫొటో)
రాజేశ్ గులాటీ, అనుపమ గులాటీ (ఫైల్ ఫొటో)

రాజేశ్ గులాటీ, అనుపమ గులాటీ (ఫైల్ ఫొటో)

Shraddha's murder: ఢిల్లీలో తన లివిన్ పార్ట్ నర్ చేతిలో శ్రద్ధ వాకర్ దారుణ హత్యకు గురికావడం దేశవ్యాప్తంగా సంచలనంతో పాటు భయాందోళనలను సృష్టించింది.

Shraddha's murder: 72 ముక్కలుగా చేసి..

ఇలాంటి దారుణ నేరమే 12 ఏళ్ల క్రితం ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం డెహ్రాడూన్ లో జరిగింది. 2010 అక్టోబర్ లో డెహ్రాడూన్ లో జరిగిన అనుపమ గులాటి(Anupama Gulati) హత్య కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనుపమ గులాటీని ఆమె భర్త రాజేశ్ గులాటీ హత్య చేసి, శరీరాన్ని 72 ముక్కలుగా చేసి, ఫ్రిజ్ లో పెట్టాడు. ఆ తరువాత, ఒక్కొక్కటిగా ఆ శరీర భాగాలను దగ్గరలోని ముస్సోరీ అటవీ ప్రాంతంలో పడేశాడు.

Shraddha's murder: రెండు హత్యల్లోనూ చాలా పోలికలు..

12 ఏళ్ల క్రితం జరిగిన అనుపమ హత్య లోనూ ఇటీవల ఢిల్లీలో జరిగిన శ్రద్ధ హత్యలోనూ చాలా పోలికలున్నాయి. అనుపమను ఆమె భర్త రాజేశ్ గులాటీ హత్య చేయగా, శ్రద్ధను ఆమె లివిన్ పార్టనర్ ఆఫ్తాబ్ దారుణంగా చంపేశాడు(Shraddha's murder). తమ జీవిత భాగస్వామ్యులను హత్య చేయాలని ఇద్దరు కూడా ముందే నిర్ణయించుకున్నారు. హత్య చేసిన తరువాత ఇద్దరు కూడా మృతదేహాలను రంపంతో ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో పెట్టారు. ఆ తరువాత, ఆ శరీర భాగాలను కొన్ని రోజుల పాటు ఒక్కొక్కటిగా రాత్రి సమయాల్లో దగ్గర్లోని అటవీ ప్రాంతాల్లో పడేశారు. దారుణంగా హత్య చేయడంతో పాటు ఆ తరువాత కూడా ఇద్దరూ అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. అంతేకాదు, ఈ రెండు కేసుల్లోనూ హంతకులు తమ పొరుగువారికి ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరించారు. కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా అనుపమ(Anupama Gulati) మెయిల్ ఐడీ నుంచి రాజేశ్ గులాటీ వారికి మెయిల్స్ చేశాడు. అలాగే, ఫ్రెండ్స్, ఫ్యామిలీకి అనుమానం రాకుండా ఆఫ్తాబ్ శ్రద్ధ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ లు చేసేవాడు.

Shraddha's murder: ఇలాంటి వారు చాలా డేంజరస్

ఇంత కోల్డ్ బ్లడెడ్ గా హత్య చేసే వారిని సాధారణ మనుషులుగా పరిగణించలేమని అనుపమ హత్య కేసును దర్యాప్తు చేసిన డెహ్రాడూన్ మాజీ ఎస్పీ జీఎస్ మార్టోలియా వ్యాఖ్యానించారు. వారు సమాజంలో సాధారణ వ్యక్తులుగా తిరగడం చాలా ప్రమాదకరమన్నారు. వారిలో నేర ప్రవృత్తి వేళ్లూనుకుపోయి ఉంటుందని హెచ్చరించారు. మృతదేహంపై కిరాతకంగా వ్యవహరించేవారిని మానసిక రోగులుగా పరిగణించాలన్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు నిత్యం కాంటాక్ట్ లో ఉండడం ద్వారా ఇలాంటి దారుణాలను అరికట్టే అవకాశాలున్నాయని సూచించారు.

టాపిక్