తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sbi Po Mains Result: ఎస్బీఐ పీఓ మెయిన్స్ ఫలితాల వెల్లడి; చెక్ చేసుకోండిలా..

SBI PO Mains Result: ఎస్బీఐ పీఓ మెయిన్స్ ఫలితాల వెల్లడి; చెక్ చేసుకోండిలా..

HT Telugu Desk HT Telugu

11 March 2023, 16:50 IST

    • SBI PO Mains Result: ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ మెయిన్స్ (SBI PO Mains Result 2022) ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

SBI PO Mains Result: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శనివారం పీఓ మెయిన్స్ రిజల్ట్ 2022 (SBI PO Mains Result 2022) ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in. లో చెక్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Cricket ball : జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకి.. 11ఏళ్ల బాలుడు మృతి!

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

SBI PO Mains Result: మొత్తం 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ లు

ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ (SBI PO Mains Result 2022) కు సంబంధించిన మెయిన్ పరీక్ష ఈ సంవత్సరం జనవరి 30న జరిగింది. ఈ పరీక్ష ఫలితాలను ఎస్బీఐ తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫేజ్ 3 లేదా సైకొమెట్రిక్ టెస్ట్ కు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఫేజ్ 3 పరీక్ష వివరాలను ఎస్బీఐ త్వరలో వెల్లడిస్తుంది. మొత్తం 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ (SBI PO Mains Result 2022) ల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ ను ఎస్బీఐ జారీ చేసింది.

SBI PO Mains Result: రిజల్ట్ ను ఇలా చెక్ చేసుకోండి..

  • మొదట, ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in.ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీలో కనిపించే కెరియర్స్ (Careers) లింక్ పై క్లిక్ చేయాలి.
  • కొత్తగా ఓపెన్ అయ్యే పేజీలో కనిపించే SBI PO Mains Result 2022 లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఎస్బీఐ పీఓ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారి పేర్లు, రోల్ నెంబర్లతో పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
  • అందులో తమ వివరాల ఆధారంగా రిజల్ట్ ను చెక్ చేసుకోవాలి.
  • రిజల్ట్ హార్డ్ కాపీని సేవ్ చేసి పెట్టుకోవాలి.
  • పూర్తి వివరాలకు ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in. ను సందర్శించాలి.

Direct link to check SBI PO Mains Result 2022

This recruitment drive will fill up 1673 posts in the organization. For more related details candidates can check the official site of SBI.

టాపిక్