SBI Clerk Main result: ఎస్బీఐ క్లర్క్ మెయిన్ ఫలితాల వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి-sbi clerk main result 2023 released at sbi co in know how to download here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Sbi Clerk Main Result 2023 Released At Sbi.co.in, Know How To Download Here

SBI Clerk Main result: ఎస్బీఐ క్లర్క్ మెయిన్ ఫలితాల వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి

HT Telugu Desk HT Telugu
Mar 11, 2023 04:09 PM IST

SBI Clerk Main result: ఎస్బీఐ క్లర్క్ మెయిన్ పరీక్ష ఫలితాలను అభ్యర్థులు ఇలా చెక్ చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Bloomberg)

SBI Clerk Main result: ఎస్బీఐ క్లర్క్ (SBI Clerk) మెయిన్ పరీక్ష ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) (Junior Associates (Customer Support & Sales)) పోస్ట్ లకు సంబంధించి ఈ మెయిన్ పరీక్షను నిర్వహించారు.

ట్రెండింగ్ వార్తలు

SBI Clerk Main result: అఫిషియల్ వెబ్ సైట్..

ఎస్బీఐ క్లర్క్ (SBI Clerk) మెయిన్ పరీక్ష ఫలితాలను ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in లో చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను గత సంవత్సరం నవంబర్ లో నిర్వహించారు. అందులో ఉత్తీర్ణులైనవారికి, ఈ SBI Clerk మెయిన్ పరీక్షను ఈ సంవత్సరం జనవరి 15న నిర్వహించారు. మొత్తం 5008 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) (Junior Associates (Customer Support & Sales)) పోస్ట్ ల భర్తీకి గానూ ఈ నోటిఫికేషన్ ను జారీ చేశారు. మెయిన్స్ ఫలితాల్లో ప్రకటించింది ప్రొవిజినల్ లిస్ట్ మాత్రమేనని, స్థానిక భాషలో ప్రొఫిషియెన్సీ టెస్ట్ లో ఉత్తీర్ణత, ఇతర అర్హతలను చెక్ చేసిన తరువాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ను విడుదల చేస్తామని ఎస్బీఐ స్పష్టం చేసింది.

SBI Clerk Main result: రిజల్ట్ చెక్ చేసుకోవడం ఇలా..

  • ముందుగా, ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in. ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీలో కనిపించే కెరియర్స్ (Careers) లింక్ పై క్లిక్ చేయాలి.
  • కొత్తగా ఓపెన్ అయ్యే పేజీలో కనిపించే RECRUITMENT OF JUNIOR ASSOCIATES (CUSTOMER SUPPORT & SALES) (Final Result Announced) లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన వారి పేర్లు, రోల్ నెంబర్లతో పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
  • అందులో తమ వివరాల ఆధారంగా రిజల్ట్ ను చెక్ చేసుకోవాలి.
  • రిజల్ట్ హార్డ్ కాపీని సేవ్ చేసి పెట్టుకోవాలి.

Direct link to check the result

WhatsApp channel

టాపిక్