తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Roadside Bomb Kills 6: రోడ్డు పక్కన పేలిన బాంబు; ఆరుగురి దుర్మరణం

Roadside bomb kills 6: రోడ్డు పక్కన పేలిన బాంబు; ఆరుగురి దుర్మరణం

HT Telugu Desk HT Telugu

06 December 2022, 19:51 IST

  • Roadside bomb kills 6: ప్రభుత్వ ఉద్యోగులున్న బస్సు వెళ్తుండగా బాంబు పేలడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మంగళవారం ఆఫ్గానిస్తాన్ లో జరిగింది.

అఫ్గాన్ లో జరిగిన బాంబు దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తులు
అఫ్గాన్ లో జరిగిన బాంబు దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తులు (AP)

అఫ్గాన్ లో జరిగిన బాంబు దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తులు

Afghan bomb blast: అఫ్గానిస్తాన్ లోని బాల్క్ రాష్ట్ర రాజధాని మజారి షరీఫ్ పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగులతో వెళ్తున్న బస్సు పక్కన బాంబు పేలడంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. బస్సులో ఉన్న వారిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Roadside bomb kills 6: రోడ్డు పక్కన బాంబు

ప్రభుత్వ ఉద్యోగులతో వెళ్తున్న బస్సుకు సమీపంలో ఈ బాంబు పేలింది. చాలా శక్తిమంతమైన బాంబు కావడంతో, బస్సు పూర్తిగా ధ్వంసమైంది. బస్సులోని ఉద్యోగుల్లో ఆరుగురు చనిపోయారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు పక్కన ఒక చక్రాల బండిని నిలిపి, అందులో ఈ శక్తిమంతమైన బాంబును అమర్చారు. హియారతన్ గ్యాస్, పెట్రోలియం డిపార్ట్ మెంట్ కు చెందిన బస్సు ఆ బండి పక్కనుంచి వెళ్తుండగా, రిమోట్ తో ఆ బండిలోని శక్తిమంతమైన బాంబును పేల్చారు. దాంతో, బస్సు పూర్తిగా ధ్వంసమైంది. మరో ఘటనలో జలాలాబాద్ పట్టణంలో ఉన్న మనీ ఎక్స్చేంజ్ మార్కెట్ లో జరిగిన బాంబు దాడిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ రెండు పేలుళ్లకు కూడా ఇప్పటివరకు ఎవరూ బాధ్యత తీసుకుంటున్నట్లు ప్రకటించలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఆఫ్గాన్ లో పలు బాంబు దాడులకు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ పాల్పడింది. అఫ్గాన్ లో అధికారంలో ఉన్న తాలిబన్ కు ఈ ఇస్లామిక్ స్టేట్ వ్యతిరేకంగా పని చేస్తోంది. 2021 నుంచి అఫ్గాన్ లో దాడులను ఈ ఇస్లామిక్ స్టేట్ తీవ్రం చేసింది.