తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Retail Inflation: ఆందోళనకరంగా రిటైల్ ద్రవ్యోల్బణం

Retail inflation: ఆందోళనకరంగా రిటైల్ ద్రవ్యోల్బణం

HT Telugu Desk HT Telugu

12 October 2022, 20:51 IST

  • Retail inflation: భారత దేశ రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టానికి చేరింది. సెప్టెంబర్ నెలలో దేశంలో ఆహారోత్పత్తులకు సంబంధించిన ద్రవ్యోల్బణం 8.6 శాతానికి చేరింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Retail inflation: ఇటీవల భారతదేశ వృద్ధి రేటును అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(IMF) 6.8 శాతానికి తగ్గించింది. భారత్ కు ద్రవ్యోల్బణం ముప్పు పొంచి ఉందని ఈ సందర్భంగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రభుత్వం వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

Retail inflation: ఐదు నెలల గరిష్టం

రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెలలో 7.41 శాతమని కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది గత ఐదు నెలల్లో గరిష్టమని తెలిపింది. ఆ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్ట్ నెలలో 7 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణంలో ఈ పెరుగుదలకు కారణం ఫుడ్ ఇన్ఫ్లేషన్ లో పెరుగుదలే కారణం. ఆహార ద్రవ్యోల్బణం ఆగస్ట్ నెలలో 7.62 శాతం ఉండగా, సెప్టెంబర్ నెలలో అది 8.6 శాతానికి చేరింది.

Retail inflation: ఇంధనం, విద్యుత్ ధరలు..

రిటైల్ ద్రవ్యోల్బణం గత 9 నెలలుగా ఆర్బీఐ మార్క్ కన్నా అధికంగా నమోదవుతోంది. మరికొన్ని నెలల పాటు ఇది ఇలాగే కొనసాగే అవకాశముంది. ఖరీఫ్ పంటల దిగుబడిలో తగ్గుదల, ఇతర అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ద్రవ్యోల్బణంలో తగ్గుదల ఇప్పట్లో ఆశించలేమని నిపుణులు చెబుతున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ నెలతో పోలిస్తే, దేశంలో ఇంధనం, విద్యుశ్చక్తి ధరలు 11.44 శాతం పెరిగాయి. వరి, పప్పులు, నూనె ధాన్యాల దిగుబడి ఈ సంవత్సరం ఖరీఫ్ లో మరింత తగ్గే అవకాశముంది.