Jio new prepaid plan : జియో కొత్త ప్లాన్ వచ్చేంది.. రోజుకు 2జీబీ డేటా!
15 August 2022, 14:41 IST
- Reliance Jio new prepaid plan : కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది జియో. రోజుకు 2జీబీ డేటా లభిస్తోంది.
కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చిన రిలయన్స్ జియో
Reliance Jio new prepaid plan : వినియోగదారులను ఆకట్టుకునేందుకు రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లతో ముందుకొస్తుంది. తాజాగా.. జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఇకపై రూ. 750కే రోజుకు 2జీబీ మొబైల్ డేటాను పొందవచ్చు! స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను విడుదల చేసింది జియో.
ఈ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ 90రోజులు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పటికే మై జియో యాప్‌లో లిస్ట్ అయ్యింది.
జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్..
గతంలో ఉన్న రూ. 749, ఆర్ఈ 1 ప్లాన్ల కలియికే ఈ కొత్త రూ. 750 ప్లాన్. రూ. 749 ప్లాన్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ డేటా, మొబైల్ డేటా (రోజుకు 2జీబీ). డైలీ లిమిట్ దాటిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64కేబీపీఎస్కి పడిపోతుంది. ఈ ప్లాన్‌తో రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తోంది.
ఆర్ఈ 1 ప్లాన్ ఆఫర్లో 100ఎంబీ హై స్పీడ్ డేటా(90రోజుల వాలిడిటీ). జియో యాప్‌లు, సావన్, జియోసినిమా ఇతర యాప్‌లు తదితర బెనిఫిట్లు ఉంటాయి.
ఇతర రిలయన్స్ జియో ప్లాన్..
Jio new prepaid plan : రూ. 249, రూ. 299, రూ. 533, రూ. 719, రూ. 799, రూ. 1066, రూ. 2879 ప్లాన్లతో పాటు ఈ రూ. 750 కొత్తగా జియో రిలయన్స్ ప్లాన్ చేరింది. ఇవన్నీ రోజుకు 2జీబీ డేటా అందిస్తున్నాయి.
ఉదాహరణకు రూ. 249 ప్లాన్.. 23రోజుల వాలిడిటీ లభిస్తోంది. రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్. 28రోజుల వాలిడిటీ ఇస్తోంది. రూ. 533 జియో రిలయన్స్ ప్లాన్ 56రోజుల వాలిడిటీ వస్తోంది. రూ. 719 ప్రీపెయిడ్ ప్లాన్.. 84రోజుల పాటు లభిస్తోంది.
రూ. 799, రూ. 1066 జియో ప్రీపెయిడ్ ప్లాన్‌తో డిస్నీ ప్లస్ హాట్‌స్టర్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ వస్తోంది. రూ. 799 ప్లాన్ 56రోజుల వాలిడిటీతో వస్తోంది. రూ. 1066 ప్లాన్‌పై.. 84రోజుల పాటు వాలిడిటీ ఇస్తోంది జియో. రిలయన్స్ జియో రూ. 2,879 ప్లాన్.. 365రోజుల వాలిడిటీతో లభిస్తోంది.