తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jio Mobile Users: మేలో 31 లక్షల మంది యూజర్లను పెంచుకున్న జియో మొబైల్

Jio mobile users: మేలో 31 లక్షల మంది యూజర్లను పెంచుకున్న జియో మొబైల్

HT Telugu Desk HT Telugu

19 July 2022, 18:01 IST

google News
  • Jio mobile users: మే నెలలో 31 లక్షల మంది కస్టమర్లు జియో నెట్‌వర్క్‌లో చేరినట్టు ట్రాయ్ నివేదించింది.

రిలయన్స్ జియో బోర్డు ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన ఆకాష్ అంబానీ, పక్కన ముఖేశ్ అంబానీ
రిలయన్స్ జియో బోర్డు ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన ఆకాష్ అంబానీ, పక్కన ముఖేశ్ అంబానీ (PTI)

రిలయన్స్ జియో బోర్డు ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన ఆకాష్ అంబానీ, పక్కన ముఖేశ్ అంబానీ

న్యూఢిల్లీ, జూలై 19: రిలయన్స్ జియో ఇండియన్ టెలికమ్ రంగంలో అగ్రగామిగా ఉండగా మే నెలలో మరో 31 లక్షల మంది ఖాతాదారులను తన నెట్‌వర్క్‌లో చేర్చుకుంది. ఈ మేరకు మంగళవారం ట్రాయ్ విడుదల చేసిన గణాంకాలు సంబంధిత వివరాలను వెల్లడించాయి.

కాగా సునీల్ మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్‌టెల్ 10.27 లక్షల సబ్‌స్క్రయిబర్లను చేర్చుకుందని, మొత్తంగా భారతీ ఎయిర్‌టెల్ మొబైల్ చందాదారుల సంఖ్య 36.21 కోట్లకు చేరిందని ట్రాయ్ గణాంకాలు తెలిపాయి.

టెలికామ్ రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నివేదించిన నెలవారీ చందాదారుల నివేదిక ప్రకారం రిలయన్స్ జియో మే నెలలో 31.11 లక్షల చందాదారులను చేర్చుకుని తన మొత్తం ఖాతాదారుల సంఖ్యను 40.87 కోట్లకు పెంచుకుంది.

అయితే వోడాఫోన్ ఐడియా మే నెలలో 7.59 లక్షల సబ్‌స్క్రయిబర్స్‌ను కోల్పోయింది. మొత్తంగా వోడాఫోన్ ఐడియా చందదారుల సంఖ్య 25.84 కోట్లకు పడిపోయింది.

BSNL వినియోగదారుల సంఖ్య కూడా దాదాపు 53.62 లక్షలు తగ్గి 11.28 కోట్లకు పడిపోయింది.

తెలుగు రాష్ట్రాలలో 3.27 లక్షల మంది కొత్త చందాదారులను చేర్చుకున్న జియో

టెలికాం రెగ్యులేటరీ సంస్థ TRAI విడుదల చేసిన తాజా సబ్‌స్క్రైబర్ డేటా ప్రకారం, మే 2022 నెలకు గాను రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 3.27 లక్షల మంది కొత్త చందాదారులను చేర్చుకుంది.

ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో రిలయన్స్ జియో అత్యధికంగా 3,27,020 మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లను జోడించింది. ఇదే నెలలో భారతీ ఎయిర్‌టెల్ 71,312 మొబైల్ చందాదారులను చేర్చుకుంది. మరోవైపు ఇదే సమయంలో వోడాఫోన్ ఐడియా 74,808 మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోగా, ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL 78,423 మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది.

తదుపరి వ్యాసం