తెలుగు న్యూస్  /  National International  /  Random Covid Testing For Arriving International Passengers From December 24

Covid testing for intl passengers: విదేశీ విమాన ప్రయాణీకులకు తాజా నిబంధనలు

HT Telugu Desk HT Telugu

22 December 2022, 23:18 IST

  • Random Covid testing for international passengers: చైనా, అమెరికా, జపాన్ సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విదేశాల నుంచి భారత్ కు వస్తున్న ప్రయాణీకులకు ర్యాండమ్ గా కరోనా టెస్ట్ లు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 24 నుంచి ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

Crime news : 8ఏళ్ల బాలిక రేప్​- హత్య.. నిందితుడి వయస్సు 13ఏళ్లు!

Prajwal Revanna : కర్ణాటకను కుదిపేస్తున్న సెక్స్​ కుంభకోణం.. దేశాన్ని విడిచి వెళ్లిపోయిన రేవన్న!

Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

Random Covid testing for international passengers: 2 శాతం ప్రయాణీకులకు..

విదేశాల నుంచి వస్తున్న విమానాల్లోని వేరు వేరు దేశాలకు చెందిన ప్రయాణీకుల్లో నుంచి ర్యాండమ్ గా ఎంపిక చేసి 2% మందిపై కరోనా టెస్ట్ లు చేయాలని నిర్ణయించారు. అలాగే, విదేశీ విమాన ప్రయాణీకులకు సంబంధించి మరికొన్ని నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించారు. అవి

  • ప్రతీ ప్రయాణీకుడు తమ దేశానికి చెందిన వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను చూపించాల్సి ఉంటుంది. తమ దేశంలో పేర్కొన్న నిర్ధారిత డోస్ ల వ్యాక్సిన్ వేసుకున్నట్లుగా చూపించాల్సి ఉంటుంది.
  • 12 ఏళ్ల లోపు పిల్లలకు ర్యాండమ్ టెస్టింగ్ నుంచి మినహాయింపునిచ్చారు. కానీ, ఒకవేళ వారిలో కోవిడ్ లక్షణాేలేవైనా కనిపిస్తే, వారిని వేరు చేసి, పరీక్ష జరిపి, చికిత్స కోసం ప్రత్యేక వైద్య కేంద్రానికి పంపిస్తారు.
  • విమానంలో కోవిడ్ లక్షణాలున్న వ్యక్తులను కూడా ఐసోలేట్ చేసి, విమానం గమ్యస్థానం చేరుకున్న తరువాత కొవిడ్ ప్రొటోకాల్ తో విమానం నుంచి దింపి, పరీక్ష జరిపి, చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రికి తరలిస్తారు.
  • ర్యాండమ్ పరీక్ష కోసం ఎంపిక చేసినవారిలో ఎవరికైనా పాజిటివ్ గా తేలితే, వారికి సమాచారమిచ్చి, ఆసుపత్రికి వెళ్లేలా సూచనలిస్తారు. ఆ ప్రయాణీకులు ఉండే ప్రాంతంలోని వైద్య అధికారులకు సమాచారమిస్తారు. వారి స్యాంపిల్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపిస్తారు.
  • ర్యాండమ్ పరీక్ష ఎవరికి జరపాలన్నది సంబంధిత ఎయిర్ లైన్స్ సిబ్బంది నిర్ణయిస్తారు. విమానంలోని అన్ని దేశాల వారు ఈ టెస్ట్ లో భాగమయ్యేలా చూస్తారు. సాంపిల్ ఇచ్చిన తరువాత వారు వెళ్లిపోవచ్చు. పరీక్ష ఫలితం వచ్చే వరకు అక్కడే ఉండాల్సిన అవసరం లేదు.
  • కోవిడ్ లక్షణాలున్న వారు ఆ విషయాన్ని దాచి పెట్టడానికి ప్రయత్నించవద్దు.
  • ఇవన్నీ డిసెంబర్ 24, శనివారం ఉదయం10 గంటల నుంచి అమల్లోకి వస్తాయి.