Covid-19 cases in US surpass 100 million: 10 కోట్లు దాటిన కరోనా కేసుల సంఖ్య
Surge in Covid cases: పలు దేశాల్లో కరోనా(corona) కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాంతో, మిగతా దేశాలు కూడా అప్రమత్తమవుతున్నాయి. భారత్ కూడా కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించాల్సిందిగా ప్రజలను కోరింది.
Covid-19 cases in US surpass 100 million: అమెరికాలో పది కోట్లు
ఇటీవల పెరిగిన కేసుల సంఖ్య కారణంగా అమెరికాలో కరోనా(corona) కేసుల సంఖ్య 10 కోట్లు దాటిందని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకటించింది.2020 మార్చ్ లో కరోనా ప్రారంభమైన నాటి నుంచి అమెరికా నమోదైన కరోనా కేసుల సంఖ్య 10 కోట్లు దాటిందని వెల్లడించింది. గురువారం నాటికి అమెరికాలో కరోనా(corona) సోకిన వారి సంఖ్య 10,00,03,837 అని తెలిపింది. ముఖ్యంగా మొదటి, రెండో వేవ్ ల సమయంలో అమెరికాలో భారీగా కరోనా(corona) కేసులు నమోదయ్యాయి. అలాగే, ఇప్పటివరకు అమెరికాలో 10.88 లక్షల మంది కోవిడ్ 19 (Covid-19) కారణంగా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది.
70% vaccination: 70% వ్యాక్సినేషన్ లక్ష్యం నెరవేరలేదు
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 (Covid-19) కారణంగా వారానికి 8 వేల నుంచి 10 వేల మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ లో కోవిడ్ 19 (Covid-19) రెస్పాన్స్ టీమ్ టెక్నికల్ హెడ్ మారియా వేన్ ఖర్కెవ్ వెల్లడించారు. ప్రతీ దేశంలో కనీసం 70% ప్రజలు టీకా తీసుకుని ఉండాలన్న లక్ష్యం నెరవేరలేదన్నారు. కోవిడ్ (Covid-19) ను నిర్మూలించడానికి టీకా తీసుకోవడం ఒక్కటే సరైన మార్గమన్నారు. ప్రస్తుతం చైనా లో కరోనా(corona) కేసుల పెరుగుదలకు ప్రధాన కారణం ఒమిక్రాన్ వేరియంట్లైన బీఏ 5.2(BA.5.2), బీఎఫ్ 7(BF.7.) అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
టాపిక్