తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Old Pension Scheme In Punjab: అక్కడ మళ్లీ పాత పెన్షన్ పథకం

Old Pension Scheme in Punjab: అక్కడ మళ్లీ పాత పెన్షన్ పథకం

HT Telugu Desk HT Telugu

18 November 2022, 20:26 IST

    • ప్రభుత్వ ఉద్యోగులకు పంజాబ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సంవత్సరాలుగా వాళ్లు చేస్తున్న డిమాండ్ కు ఒప్పుకుంటూ, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించడానికి అంగీకరించింది.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Twitter)

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్

Old Pension Scheme in Punjab: పాత పెన్షన్ పథకాన్ని(Old Pension Scheme OPS) పునరుద్ధరించడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో, అనేక రాష్ట్రాలు ఆ డిమాండ్ కు తలొగ్గడం లేదు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

1.75 lakh benefitting employees: పాత పెన్షన్ పథకం (Old Pension Scheme OPS)

పంజాబ్ లో పాత పెన్షన్ పథకాన్ని(Old Pension Scheme OPS) పనరుద్ధరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ రాష్ట్రంలోని ఆప్ ప్రభుత్వం సంబంధిత నోటిఫికేషన్ ను జారీ చేసింది. అధికారిక లెక్కల ప్రకారం.. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 1.75 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. 1.26 లక్షల మంది ఉద్యోగులు ఇప్పటికే ఈ OPS లో ఉన్నారు. ఈ పెన్షన్ పథకానికి భవిష్యత్తులోనూ ఆర్థికంగా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అవసరమైన నిధులతో కార్బస్ ఫండ్ ను ఏర్పాటు చేయాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. చాలా రాష్ట్రాల్లో కొత్త పెన్షన్ పథకం(New Pension Scheme -NPS))లో ఉన్న లక్షలాది ఉద్యోగుల ప్రధాన డిమాండ్ గా ఇది ఉంది.

corpus fund for OPS: రూ. 1000 కోట్లు..

కార్పస్ ఫండ్ కోసం ప్రతీ సంవత్సరం రూ. 1000 కోట్లను కేటాయిస్తామని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. భవిష్యత్తులో, రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను అధిగమించిన తరువాత, ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచుతామని హామీ ఇచ్చింది. అలాగే, కొత్త పెన్షన్ పథకం కింద ఇప్పటికే చెల్లించిన కార్పస్ రూ. 16,747 కోట్లను తిరిగి చెల్లించాలని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(Pension Fund Regulatory and Development Authority - PFRDA) ను పంజాబ్ ప్రభుత్వం అభ్యర్థించింది. భవిష్యత్తులో ప్రభుత్వ సర్వీసుల్లో చేరేవారికి కూడా ఈ సదుపాయం కొనసాగేలా చూస్తామని పంజాబ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Financially not viable: ఆర్థికంగా ప్రమాదకరం

పాత పెన్షన్ పథకం వల్ల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతాయని, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తలెత్తుతుందని ఆర్థిక వ్యవహారాల నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాత పెన్షన్ పథకాన్ని మళ్లీ అమలు చేయాలనుకోవడం ఆత్మాహత్యాసదృశ్యమని కాగ్(Comptroller and Auditor General) గిరీశ్ చంద్ర ముర్ము కూడా ఇటీవల హెచ్చరించారు. అయినా, చాలా రాష్ట్రాల్లో పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ అనేది ప్రధాన ఎన్నికల హామీగా ఉంటోంది. ముఖ్యంగా, ఆప్, కాంగ్రెస్ లు తమ ఎన్నికల హామీల్లో దీన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి.