తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  President Election Results: నేడు రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ - విజేత ఎవరు..?

President Election Results: నేడు రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ - విజేత ఎవరు..?

HT Telugu Desk HT Telugu

21 July 2022, 7:04 IST

    • president of india elections:ఇవాళ రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందులో గెలిచిన  అభ్యర్థి.. భారతదేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణం చేస్తారు.
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు (HT)

రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు

president of india elections 2022 results: దేశానికి కొత్త రాష్ట్రపతి ఎవరు..? ఎన్డీయే నుంచి బరిలో ఉన్న ముర్మునా లేక విపక్షాలు నిలబెట్టిన యశ్వంత్ సిన్హానా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. ఈ మేరకు అధికారులు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్లమెంట్‌ హౌస్‌లోని 63వ నంబర్‌ గదిలో లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్‌ బాక్సులను పార్లమెంట్‌ కు చేర్చారు. సాయంత్రానికి తుది ఫలితాలు వెలుబడే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్‌ కొవింద్‌ పదవీకాలం ఈ నెల 24న ముగియనుంది. నూతన రాష్ట్రపతి ఈ నెల 25న ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు యశ్వంత్‌ సిన్హా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ట్రెండ్స్ ప్రకారం… ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలిచే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Presidential Elections: పార్లమెంట్‌తోపాటు, రాష్ట్రాల అసెంబ్లీల్లో సోమవారం రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. నూతన రాష్ట్రపతి కోసం ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీతోపాటు అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంట్‌లో 99.18 శాతం ఓటింగ్ నమోదైంది. 4,796 మంది ఎలక్టోరల్‌ కాలేజీ ఓటర్లలో 771 మంది ఎంపీలు, 4వేల, 25 మంది ఎమ్మెల్యేలున్నారు.

రాష్ట్రపతి ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. ప్రజలకు నేరుగా ఎన్నుకునే అవకాశం ఉండదు. దేశ పార్లమెంట్‌లో ఎంపీలు, రాష్ట్రాల అసెంబ్లీల్లో శాసన సభ్యులు ఓటు వేసి, రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ప్రధాని మోదీతోపాటు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మమతా బెనర్జీ, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

టాపిక్