తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm To Launch 5g Services: రేపు 5 జీ సేవలు ప్రారంభం

PM to launch 5G services: రేపు 5 జీ సేవలు ప్రారంభం

HT Telugu Desk HT Telugu

30 September 2022, 17:28 IST

  • PM to launch 5G services: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం భారత్ లో వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించే 5 జీ టెలీకాం సర్వీసెస్ ను ప్రారంభించనున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో) (ANI)

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో)

PM to launch 5G services: భారత్ లో 5 జీ సేవలను ప్రధాని మోదీ శనివారం, అక్టోబర్ 1న, 2022న ప్రారంభించనున్నారు. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

PM to launch 5G services: మొదట కొన్ని నగరాల్లోనే..

ఈ సేవలు మొదట కొన్ని నగరాల్లోనే అందుబాటులోకి వస్తాయి. క్రమంగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తారు. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించే 5 జీ సర్వీసెస్ వల్ల విద్య, వైద్యం, ప్రజా సేవలు, వ్యాపార, వాణిజ్య రంగాలకు పెను ప్రయోజనం కలుగుతుంది. 2035 నాటికి 5జీ సేవల వల్ల ఒనగూరే ప్రయోజనం దాదాపు 450 బిలియన్ డాలర్లని అంచనా.

PM to launch 5G services: ప్రగతి మైదాన్ నుంచి..

అక్టోబర్ 1న ఢిల్లీలోని ప్రగతి మైదాన్ నుంచి భారత్ లో 5జీ సేవలను ప్రధాని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, టెలీకాం కంపెనీ అధిపతులు పాల్గొనే అవకాశముంది. రిలయన్స్ నుంచి ముకేశ్ అంబానీ, ఎయిర్ టెల్ నుంచి సునీల్ మిట్టల్, వీ ఇండియా హెడ్ రవిందర్ ఠక్కర్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇదే కార్యక్రమంలో ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022’ ఎడిషన్ ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు.

PM to launch 5G services: దీపావళి నుంచి జియో సేవలు

భారత్ లో 5జీ సేవలను అందించడానికి అవసరమైన మౌలిక వసతులను టెలీకాం కంపెనీలు ఇప్పటికే సమకూర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దీపావళి నుంచి భారత్ లోని కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో 5 జీ సేవలను ప్రారంభించబోతున్నట్లు రిలయన్స్ జియో ఇప్పటికే ప్రకటించింది. ఎయిర్ టెల్, వీ సంస్థలు తమ 5జీ సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయో రేపు ప్రకటించే అవకాశముంది.