తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kepler 1658b : భూమి అంతం అయ్యేది ఇలాగే! ఎప్పుడంటే..

Kepler 1658B : భూమి అంతం అయ్యేది ఇలాగే! ఎప్పుడంటే..

20 December 2022, 7:18 IST

    • End of Earth : భూమికి.. 2600 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ గ్రహం.. తన సూర్యుడిని ఢీకొట్టబోతోందని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. భూమి అంతం కూడా ఇదే విధంగా జరగొచ్చని భావిస్తున్నారు.
భూమి అంతం అయ్యేది ఇలాగే! ఎప్పుడంటే..
భూమి అంతం అయ్యేది ఇలాగే! ఎప్పుడంటే..

భూమి అంతం అయ్యేది ఇలాగే! ఎప్పుడంటే..

End of Earth : భూమికి 2600 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కేప్లర్​ 1658బీ అనే గ్రహం.. అది పరిభ్రమిస్తున్న సూర్యుడికి దగ్గరగా వెళుతూనే ఉంది. చివరికి సూర్యుడితో అది ఢీకొట్టబోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రక్రియను క్షుణ్నంగా పరిశీలించడం అత్యావశ్యకం అని, భూమి అంతం కూడా ఇదే విధంగా ఉండొచ్చని చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Heatwave alert : తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు భానుడి భగభగలు- ఆ తర్వాత భారీ వర్షాలు!

JNU PG Admissions 2024 : జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

ఈ కెప్లర్​ 1658బీ గ్రహానికి 'హాట్​ జూపిటర్​' అనే పేరు కూడా ఉంది. ఈ గ్రహం మన సౌర మండలంలోని జూపిటర్​ సైజుతో పోలి ఉంటుంది. మన సూర్యుడు- మెర్క్యూరీ మధ్య ఉన్న దూరంతో పోల్చుకుంటే.. ఈ గ్రహాం దాని సూర్యుడి మధ్య ఉన్న దూరం 8వ వంతు మాత్రమే. ఫలితంగా ఈ కెప్లర్​ 1658బీ వాతావరణం ఎన్నో రెట్లు వేడిగా ఉంటుంది. సూర్యుడి చుట్టు తిరగడానికి ఈ కెప్లర్​ 1658బీ.. కేవలం 3 రోజుల సమయం తీసుకుంటుంది. ఈ గ్రహం సూర్యుడికి సమీపంగా వెళుతున్న కొద్ది ఆ సమయం తగ్గిపోతూ వస్తోంది. ఇప్పటికైతే.. ఏడాదికి 131మిల్లిసెకన్ల సమయం కరిగిపోతోంది అని ఆస్ట్రాఫిజికల్​ జర్నల్​ లెటర్స్​లో ప్రచురితమైన ఓ స్టెడీ పేర్కొంది.

Planet colliding with Sun : "ఈ గ్రహాం.. ఇదే వేగంతో వెళితే.. 3 మిలియన్​ సంవత్సరాల తర్వాత సూర్యుడిని ఢీకొంటుంది. ఓ గ్రహం దాని సూర్యుడివైపు వెళుతున్న ప్రక్రియను మనం చూడటం ఇదే తొలిసారి," అని అధ్యయనం రచయిత, హార్వడ్​ స్మిథ్​సోనియన్​ సెంటర్​ ఆఫ్​ ఆస్ట్రోఫిజిక్స్​ పోస్ట్​డాక్​ శ్రేయాస్​ విస్సప్రగడ పేర్కొన్నారు.

కెప్లర్​ స్పేస్​ టెలిస్కోప్​ ద్వారా గుర్తించిన తొలి ఎక్సోప్లానెట్​ ఈ కెప్లర్​ 1658బీ. దీనిని 2009లో గుర్తించారు. కానీ 2019 వరకు వివిధ పరిశోధనలు జరిపిన తర్వాతే ఈ గ్రహం ఉనికిని శాస్త్రవేత్తలు నిశ్చయించారు. సూర్యుడి ముఖ భాగం నుంచి వెళుతున్నప్పుడల్లా ఆ గ్రహం కక్షలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని.. 13ఏళ్ల పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గ్రహాం.. శాస్త్రవేత్తలు గతంలో భావించిన దాని కన్నా ఎన్నో రెట్లు వేడిగా ఉందని కూడా తెలిసింది. సూర్యుడివైపు వెళుతుండటానికి ఇది కూడా ఓ కారణం అయ్యి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు శాస్త్రవేత్తలు.

భూమి పరిస్థితేంటి?

Kepler 1658B collision with its Sun : "సూర్యుడి వయస్సు పెరిగే కొద్దీ ఈ ప్రక్రియ కనిపించవచ్చు. ఈ థియరీని కొట్టిపారేయలేము. అంటే.. బిలియన్ల సంవత్సరాల తర్వాత భూమి కూడా ఇలాగే అంతం అయ్యే అవకాశం ఉంది," అని శ్రేయాస్​ అన్నారు.

How Earth will end : 5 బిలియన్​ సంవత్సరాల తర్వాత.. మన సూర్యుడు 'రెడ్​ జెయింట్​'గా అవతరించే అవకాశం ఉందని, అప్పుడు భూమి మెల్లిగా సూర్యుడికి దగ్గరవ్వొచ్చని శ్రేయాస్​ పేర్కొన్నారు. అయితే.. సూర్యుడు వయస్సు పెరిగే కొద్ది.. ద్రవ్యరాశి(మస్​)ని కోల్పోతుంటే.. ఈ ప్రక్రియ ద్వారా భూమి కక్ష తగ్గకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

టాపిక్