తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pak Terrorist Killed: సరిహద్దుల్లో పాకిస్తాన్ టెర్రరిస్ట్ హతం

Pak terrorist killed: సరిహద్దుల్లో పాకిస్తాన్ టెర్రరిస్ట్ హతం

HT Telugu Desk HT Telugu

26 October 2022, 17:10 IST

  • Pak terrorist killed: జమ్మూకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో పాకిస్తాన్ నుంచి భారత్ లో చొరబడేందుకు ప్రయత్నించిన లష్కరే తోయిబా ఉగ్రవాదిని భద్రతాబలగాలు హతమార్చాయి. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Pak terrorist killed: అననుకూల వాతావరణ పరిస్థితుల ఆసరాతో పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు భారత్ లో చొరబడేందుకు ప్రయత్నిస్తుంటారు. వారి ప్రయత్నాలను భారత భద్రత బలగాలు ప్రాణాలు పణంగా పెట్టి విఫలం చేస్తుంటారు.

ట్రెండింగ్ వార్తలు

Cricket ball : జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకి.. 11ఏళ్ల బాలుడు మృతి!

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Pak terrorist killed: కుప్వారా జిల్లాలో..

జమ్మూకశ్మీర్ లో పాకిస్తాన్ సరిహద్దుల్లో కుప్వారా జిల్లా ఉంది. ఇరు దేశాల సరిహద్దు అయిన నియంత్రణ రేఖను దాటుకుని కుప్వారా జిల్లాలోకి చొరబడాలని ప్రయత్నించిన ఒక ఉగ్రవాది ప్రయత్నాన్ని భద్రత బలగాలు విఫలం చేశాయి. మంగళవారం రాత్రి భారత్ లోకి చొరబడాలని పాక్ ఆక్రమిత కశ్మీర్ కు చెందిన మొహమ్మద్ షాకూర్ ప్రయత్నించాడు. మొహమ్మద్ షాకూర్ నిషేధిత లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన వాడు. భారత భద్రత బలగాల కాల్పుల్లో అతడు హతమయ్యాడు.

Pak terrorist killed: పక్కా సమాచారంతో..

పాకిస్తాన్ నుంచి లష్కరే తోయిబా ఉగ్రవాదులు కుప్వారా జిల్లాలోని సుద్పురా ఫార్వర్డ్ పోస్ట్ ద్వారా భారత్ లోకి చొరబడనున్నారన్న పక్కా సమాచారంతో భద్రత బలగాలు జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి ఈ ఆపరేషన్ చేపట్టాయి. బుధవారం తెల్లవారుజామున ఇద్దరు ఉగ్రవాదులు భారత్ లోకి రావడానికి ప్రయత్నించడాన్ని గుర్తించాయి. వెంటనే వారిపై కాల్పులు జరిపాయి. భద్రత బలగాల కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఉగ్రవాది తప్పించుకుని పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి పారిపోయాడు. అనంతరం, బుధవారం ఉదయం ఆ ప్రాంతంలో భద్రత బలగాలు గాలింపు చేపట్టాయి. వారికి ఏకే సిరీస్ రైఫిల్, రెండు పిస్టళ్లు, పెద్ద ఎత్తున బుల్లెట్లు, ఇతర మందుగుండు సామగ్రి లభించాయి.