Encounter: జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం-terrorists involved in killing of policeman in pulwama shot dead in encounter ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Encounter: జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

Encounter: జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

HT Telugu Desk HT Telugu
Oct 05, 2022 08:40 AM IST

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

<p>ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సాయుధ బలగాలు (ప్రతీకాత్మక చిత్రం)</p>
ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సాయుధ బలగాలు (ప్రతీకాత్మక చిత్రం)

జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్‌లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్ (జేఎం) సంస్థతో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఉగ్రవాదుల్లో ఇద్దరు పుల్వామాలో ఒక పోలీసు, స్థానికేతర కార్మికుడిని చంపిన ఘటనల్లో  పాల్గొన్నారు. లష్కర్‌తో సంబంధం ఉన్న మరో ఉగ్రవాదిని ప్రత్యేక ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపారు.

‘నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌తో సంబంధం కలిగి ఉన్న ముగ్గురు స్థానిక టెర్రరిస్టులు షోపియాన్‌లోని డ్రాచ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. మూలూలో మరో ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది..’ అని కాశ్మీర్ జోన్ పోలీసులు ఇంతకు ముందు ఒక ట్వీట్‌లో తెలిపారు.

‘ఉగ్రవాదులు హనన్ బిన్ యాకూబ్, జంషెడ్ పుల్వామాలోని పింగ్లానాలో అక్టోబరు 2న ఎస్పీవో జావేద్ దార్‌ను, సెప్టెంబరు 24న పుల్వామాలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన కార్మికుడిని హతమార్చారు..’ అని పోలీసులు తెలిపారు.

ఆదివారం మధ్యాహ్నం పుల్వామాలోని పింగ్లానా ప్రాంతంలో పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) సంయుక్త బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో జావిద్ అహ్మద్ దార్ మరణించాడు. ఈ ఘటనలో ఒక సీఆర్పీఎఫ్ జవాను కూడా గాయపడ్డాడు.

షోపియాన్ మూలు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ఉగ్రవాది హతమయ్యాడు. గత కొన్ని నెలలుగా జమ్మూ కాశ్మీర్‌లో పలువురు స్థానికేతరులు లక్ష్యంగా చేసుకున్నారు. సోమవారం బారాముల్లాలోని ఒక బ్యాంకు మేనేజర్‌ను లక్ష్యంగా చేసుకోగా, అతను తప్పించుకోగలిగాడు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించనున్న బారాముల్లా సభకు కొన్ని గంటల ముందు డ్రాచ్, మూలూలో ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా పట్టణంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 11 గంటలకు జరిగిన ర్యాలీలో అమిత్ షా ప్రసంగిస్తారు.

బుద్గామ్ నుండి బారాముల్లాకు రైలు సర్వీసును నిలిపివేసి, ట్రాఫిక్‌ను మళ్లించారు. శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపై అదనపు చెక్ పాయింట్లను ఏర్పాటు చేశారు.

Whats_app_banner