Biden on Pakistan : ‘ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశం పాకిస్థాన్’
15 October 2022, 12:58 IST
Biden's candid comment on Pakistan : పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో పాక్ ఒకటని పేర్కొన్నారు.
జో బైడెన్
Biden comments on Pakistan : పాకిస్థాన్‌ను.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఒకటిగా అభివర్ణించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఏ విధమైన సమన్వయం లేకుండా, అణ్వాయుధాలు కలిగిన దేశం పాకిస్థాన్ అని అభిప్రాయపడ్డారు.
కాలిఫోర్నియాలో జరిగిన డెమొక్రటిక్ కాంగ్రెషనల్ క్యాంపైన్ కమిటీ రిసెప్షన్లో పాల్గొన్నారు జో బైడెన్. చైనా, రష్యాలతో పాటు పాకిస్థాన్‌పైనా మండిపడ్డారు.
US Pakistan relation : చైనా, రష్యాలపై అమెరికా విదేశాంగ విధానాల గురించి మాట్లాడుతూ.. పాకిస్థాన్‌పై ఈ విధంగా వ్యాఖ్యానించారు జో బైడెన్.
"తనకేం కావాలో ఈ వ్యక్తికి(చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్) చాలా బాగా తెలుసు. కానీ ఆయనకు చాలా సమస్యలు ఉన్నాయి. దానిని మనం ఎలా హ్యాండిల్ చేయగలం? రష్యాలో జరుగుతున్న దానితో మనం ఎలా ఉండాలి? ఇక ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో పాకిస్థాన్ ఒకటని నా అభిప్రాయం. ఎలాంటి సమన్వయం లేకుండా అణ్వాయుధాలు కలిగిన దేశం అది," అని బైడెన్ మాట్లాడినట్టు శ్వేతసౌధం ఓ ప్రకటనలో పేర్కొంది.
Joe Biden latest news : అమెరికాతో గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌కు సత్సంబంధాలు లేవు. అగ్రరాజ్యంతో బంధం పెంచుకోవాలని పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ సమయంలో బైడెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. పాక్‌కు మరింత కష్టాలు తెచ్చిపెట్టాయి.
21వ దశాబ్దం రెండో భాగంలో ప్రపంచాభివృద్ధికి అమెరికా తోడ్పడేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని బైడెన్ అభిప్రాయపడ్డారు. అమెరికన్లు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు.
పాక్‌పై కోపం ఎందుకు?
అమెరికా నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటీ నివేదిక బుధవారం విడుదలైంది. చైనా, రష్యా నుంచి వచ్చే ముప్పు గురించి ఈ 48పేజీల డాక్యుమెంట్లో అధికారులు వివరించారు. ఇందులో పాకిస్థాన్ పేరు లేదు. అలాంటిది, ఇప్పుడు పాక్‌పై బైడెన్ మండిపడటం సర్వత్రా చర్చకు దారితీసింది.