తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Penalty To Bengal Govt: బెంగాల్ సర్కార్ కు ఎన్జీటీ షాక్.. రూ. 3500 కోట్ల ఫైన్

Penalty to Bengal govt: బెంగాల్ సర్కార్ కు ఎన్జీటీ షాక్.. రూ. 3500 కోట్ల ఫైన్

HT Telugu Desk HT Telugu

04 September 2022, 11:31 IST

  • ngt penalty to bengal govt: బెంగాల్ సర్కార్ కు షాక్ ఇచ్చింది నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ). చెత్త నిర్వహణలో నిబంధనలు పాటించటం లేదని రూ.3500 కోట్లు జరిమానా విధించింది.

రూ. 3,500 కోట్లు జరిమానా
రూ. 3,500 కోట్లు జరిమానా

రూ. 3,500 కోట్లు జరిమానా

ngt penalty on west bengal govt: బెంగాల్‌ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా విధించింది. ఘన, ద్రవరూప చెత్త నిర్వహణలో విఫలమైనందుకు గానూ రూ.3500 కోట్ల ఫైన్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. 2022-2023 రాష్ట్ర బడ్జెట్‌ ప్రకారం పట్టణాభివృద్ధి, మున్సిపల్‌ వ్యవహారాలకు సంబంధించి 12,819కోట్లు రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంది. కానీ పారిశుద్ధ్య నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వలేదని ఎన్జీటీ బెంచ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Heatwave alert : తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు భానుడి భగభగలు- ఆ తర్వాత భారీ వర్షాలు!

JNU PG Admissions 2024 : జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

national green tribunal serious on bengal govt: దీర్ఘకాల భవిష్యత్తు కోసం ఆరోగ్య సంబంధిత సమస్యలను వాయిదా వేయలేయని... ప్రజలకు కాలుష్య రహిత పర్యావరణాన్ని అందించడం స్థానిక సంస్థలు, రాష్ట్రాల రాజ్యాంగ బాధ్యత అని ఎన్‌జీటీ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఏకే గోయెల్‌ వ్యాఖ్యానించారు. నిధుల కొరత ఉందని ప్రజలకు జీవించే హక్కును తిరస్కరించకూడదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో రోజుకు 2,758 మిలియన్ల లీటర్ల మురుగు నీరు పోగవుతోందని, అయితే.. 44 ఎస్‌టీపీల ఏర్పాటుతో కేవలం 1,268 ఎంఎల్‌డీలు మాత్రమే శుభ్రం చేస్తున్నారని పేర్కొంది. రెండింటి మధ్య అంతరం భారీగా ఉందని బెంచ్ అసహనం వ్యక్తం చేసింది.

2 నెలల్లో చెల్లించాలి..

నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిందని.. 2 నెలల్లోపు రూ.3500 కోట్లను జమ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే అదనపు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఇకనైనా చెత్త నిర్వహణపై బెంగాల్‌ సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించింది. వ్యర్థ పదార్థాల నిర్వహణ అంశంలో పర్యావరణ నిబంధనలను పాటించడం అత్యంత ప్రాధాన్యతగల అంశమని ప్రస్తావించింది. చాలా కాలంగా ఈ సమస్యలను గుర్తించి పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని, తగిన నిబంధనలు తక్షణమే పాటించాలని స్పష్టం చేసింది.

టాపిక్