పశ్చిమబెంగాల్‌లో బిదిశా డే మజుందార్ పాపులర్ మోడల్. నటి. సీనియర్ నటులతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మోడల్ బిదిశా. అనూహ్యంగా రెండు రోజుల క్రితం, మే 25న ఆమె తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుంది. మొదట బాయ్‌ఫ్రెండ్‌తో విబేధాలే ఈ ఆత్మహత్యకు కారణమని అంతా భావించారు. కానీ ఇందులో అనూహ్యంగా మరో ట్విస్ట్ తాజాగా బయటపడింది.,మరో మోడల్‌ను తన భార్య అంటూ..మే 25న 21 ఏళ్ల మోడల్, నటి బిదిశా డే మజుందార్ కోల్‌కతాలోని డమ్‌డమ్‌లో ఉన్న తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకుంది. తాజాగా, ఆత్మహత్య చేసుకున్న నటి బిదిశా వ్యక్తిగత వివరాలు, ఆమె లైంగిక ఆసక్తులు వెలుగులోకి వచ్చాయి. బిదిశా లెస్బియన్ అని, మరో నటి, మోడల్‌ను తన `భార్య` అని బిదిశా సంబోధించేదని, వాళ్లిద్దరి మధ్య లైంగిక అనుబంధం ఉండేదని కోల్‌కతా పేజ్ 3 సర్కిల్స్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. `లవ్ యూ వైఫ్` అనే క్యాప్షన్‌తో బిదిశా తన ఫేస్‌బుక్ పేజ్‌లో ఆ నటితో కలిసి సన్నిహితంగా ఉన్న ఫొటోను కూడా షేర్ చేసింది. తను ఆత్మహత్య చేసుకున్న రోజే ఆ ఫొటోను ఆమె షేర్ చేయడం గమనార్హం. ఆ నటిని తన భార్యలా భావిస్తూ.. ఆమె నుదుటిపై సింధూరం కూడా పెట్టేదని బిదిశా సన్నిహితులు పోలీసులకు తెలిపారు. ఈ సంబంధం కారణంగానే బిదిశా ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ఇప్పుడు అనుమానిస్తున్నారు. మరోవైపు, బిదిశా మరణంతో ఆ `వైఫ్` మానసికంగా కుంగిపోయిందని తెలిసింది.,ఆ మరో మోడల్ ఆత్మహత్యఇదిలా ఉండగా, కోల్‌కతాలో మే 27, శుక్రవారం మరో మోడల్ మంజూష నియోగి ఆత్మహత్య చేసుకుంది. కోల్‌కతాలోని తన నివాసంలో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ మంజూష నియోగి రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న మోడల్ బిదిశాకు చాలా సన్నిహితురాలు. బిదిశా మరణంతో ఈమె డిప్రెషన్‌లోకి వెళ్లింది. `నా కూతురు ఎప్పుడూ బిదిశా గురించే చెబుతుండేది. బిదిశాతో కలిసి ఉండాలనేది తన కోరిక అని చెప్పేది. ఈ విషయంలో నేను తనను చాలా సార్లు తిట్టాను కూడా` అని మంజూష తల్లి మీడియాకు తెలిపారు.