తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sonia Gandhi : రాజకీయాల నుంచి సోనియా గాంధీ రిటైర్మెంట్​ తీసుకోనున్నారా?

Sonia Gandhi : రాజకీయాల నుంచి సోనియా గాంధీ రిటైర్మెంట్​ తీసుకోనున్నారా?

Sharath Chitturi HT Telugu

25 February 2023, 13:45 IST

    • Congress plenary session Sonia Gandhi : భారత్​ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్​ను ముగిస్తుండటం సంతోషంగా ఉందన్నారు కాంగ్రెస్​ సీనియర్​ నేత సోనియా గాంధీ. ఈ నేపథ్యంలో ఆమె రిటైర్మెంట్​పై ఊహాగానాలు జోరందుకున్నాయి.
రాయ్​పూర్​ సభలో ప్రసంగిస్తున్న సోనియా గాంధీ
రాయ్​పూర్​ సభలో ప్రసంగిస్తున్న సోనియా గాంధీ (ANI)

రాయ్​పూర్​ సభలో ప్రసంగిస్తున్న సోనియా గాంధీ

Congress plenary session Sonia Gandhi : గత నెలతో ముగిసిన భారత జోడో యాత్రతో తన రాజకీయ ఇన్నింగ్స్​ ముగిసిందన్న సంకేతాలు ఇచ్చారు కాంగ్రెస్​ మాజీ అధ్యక్షురాలు, పార్టీ కీలక నేత సోనియా గాంధీ. భారత్​ జోడో యాత్రను.. పార్టీ చరిత్రలోనే ఓ కీలక మలుపుగా అభివర్ణించారు.

ట్రెండింగ్ వార్తలు

Covid vaccine: సేఫ్టీ ఇష్యూస్ కారణంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉపసంహరించుకోనున్న ఆస్ట్రాజెనెకా

Haryana: హరియాణాలో సంక్షోభంలో బీజేపీ సర్కారు; అసెంబ్లీలో మారిన సంఖ్యాబలం

US crime news: ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ - మూడేళ్ల కొడుకును షూట్ చేసి చంపేసిన కర్కశ తల్లి

Sunita Williams space mission : చివరి నిమిషంలో.. సునీత విలియమ్స్ 3వ​ స్పేస్​ మిషన్​ రద్దు!

కాంగ్రెస్​ ప్లీనరీ సమావేశాలు..

ఛత్తీస్​గఢ్​ రాజధానీ రాయ్​పూర్​లో మూడు రోజుల కాంగ్రెస్​ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం మొదలయ్యాయి. రెండో రోజు కార్యకలాపాల్లో భాగంగా 15వేల మంది పార్టీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు సోనియా గాంధీ.

Sonia Gandhi retirement : "భారత్​ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్​ ముగిసే అవకాశం ఉంది. ఇది నాకు సంతోషాన్నిచ్చే విషయం. భారత్​ జోడో యాత్ర.. పార్టీకి టర్నింగ్​ పాయింట్​. దేశంలో శాంతి, సామరస్యాన్ని ప్రజలు కోరుకుంటున్నారని రుజువైంది," అని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో సోనియా గాంధీ.. రాజకీయాల నుంచి రిటైర్మెంట్​ తీసుకుంటారా? అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

Sonia Gandhi Bharat Jodo Yatra : మరోవైపు.. 2024 లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో 85వ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. భారత్​ జోడో యాత్ర విజయవంతమైన తరుణంలో ఈ ప్లీనరీ సమావేశాలకు ప్రాధాన్యత మరింత పెరిగాయి. వివిధ ఎన్నికల్లో కాంగ్రెస్​ రచించాల్సిన వ్యూహాలు.. ఇతర పార్టీలతో పొత్తులు వంటి వాటిపై చర్చలు జరిగే అవకాశం ఉంది.

Congress plenary session Raipur : సమావేశాల తొలి రోజులో భాగంగా.. పాలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు పార్టీ సభ్యులు. సీడబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించకూడదని అంగీకారానికి ఒచ్చారు. సభ్యులను నామినేట్​ చేసే అధికారాన్ని పార్టీ చీఫ్​ మల్లిఖార్జున ఖర్గేకు అప్పగించారు.