తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Draupadi Murmu: కేరళ నుంచి అనూహ్యంగా ఓటు సాధించిన ద్రౌపది ముర్ము..

Draupadi Murmu: కేరళ నుంచి అనూహ్యంగా ఓటు సాధించిన ద్రౌపది ముర్ము..

HT Telugu Desk HT Telugu

22 July 2022, 10:23 IST

    • Draupadi Murmu: ద్రైపది ముర్ముకు కేరళ నుంచి అనూహ్యంగా ఓటు దక్కడంతో అది పాజిటివ్ ఓటని బీజేపీ అభివర్ణించింది.
సోమవారం రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఓటు వేసిన తరువాత గ్రూప్ ఫోటో దిగుతున్న కేరళ ఎంపీలు
సోమవారం రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఓటు వేసిన తరువాత గ్రూప్ ఫోటో దిగుతున్న కేరళ ఎంపీలు (Amlan Paliwal)

సోమవారం రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఓటు వేసిన తరువాత గ్రూప్ ఫోటో దిగుతున్న కేరళ ఎంపీలు

తిరువనంతపురం, జూలై 22: రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము చారిత్రాత్మక విజయం సాధించారు. అయితే కేరళలో ఎన్డీయే అభ్యర్థికి అనూహ్య ఓట్లు రావడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

కేరళ నుంచి ముర్ముకు ఒక ఓటు లభించింది. 140 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి శాసనసభ్యుడు లేనందున, మొత్తం ఓట్లు ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు పోల్ అవుతాయని సాధారణ అంచనాలు ఉండేవి.

సిపిఐ (ఎం) నేతృత్వంలోని అధికార ఎల్‌డిఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ప్రతిపక్ష ఫ్రంట్ సిన్హాకు తమ మద్దతును ప్రకటించాయి. ఎన్డీయే అభ్యర్థికి పడిన ఓటు పొరపాటున పడిందా లేక ఉద్దేశపూర్వకంగా వేసిందా అన్నది ఇప్పుడు రాజకీయ పరిశీలకులు లేవనెత్తుతున్న ప్రశ్న.

ఎన్డీయే అభ్యర్థికి ఊహించని రీతిలో ఒక్క ఓటు రావడంపై బీజేపీ రాష్ట్ర శాఖ ఇప్పటికే సంతోషం వ్యక్తం చేసింది. పోలైన 139 ఓట్ల కంటే కేరళ నుంచి ద్రౌపది ముర్ము సాధించిన ఒక్క ఓటుకే ఎక్కువ విలువ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ అన్నారు.

రాష్ట్రంలో రెండు ఫ్రంట్‌లు తీసుకున్న ప్రతికూల వైఖరికి వ్యతిరేకంగా ముర్ముకు వచ్చిన ఓటు "సానుకూల ఓటు" అని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాను ఓడించి ద్రౌపది ముర్ము దేశానికి తొలిసారి గిరిజన అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.