తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Priyanka Gandhi Joins Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో ప్రియాంక ఫ్యామిలీ

Priyanka Gandhi joins Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో ప్రియాంక ఫ్యామిలీ

HT Telugu Desk HT Telugu

24 November 2022, 14:50 IST

  • Priyanka Gandhi joins Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా గురువారం భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.  రాహుల్ గాంధీ చేపట్టిన ఈ దేశవ్యాప్త పాదయాత్ర ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో కొనసాగుతోంది.

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో ప్రియాంక గాంధీ
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో ప్రియాంక గాంధీ (PTI)

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో ప్రియాంక గాంధీ

Bharat Jodo Yatra in Madhya Pradesh: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన దేశ వ్యాప్త పాద యాత్ర ‘భారత్ జోడో యాత్ర’ మధ్య ప్రదేశ్ లో కొనసాగుతోంది. ఖాండ్వ జిల్లా లోని బోర్గావ్ నుంచి గురువారం పాదయాత్రను రాహుల్ ప్రారంభించారు.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

Priyanka Gandhi family joins Bharat Jodo Yatra:ప్రియాంక కుటుంబం

మధ్య ప్రదేశ్ లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర లో గురువారం ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. అన్న రాహుల్ గాంధీతో పాటు నడక ప్రారంభించారు. ప్రియాంక(Priyanka Gandhi)తో పాటు ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు రేహన్ ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. బుధవారం యాత్ర ప్రారంభమయ్యే ఖాండ్వ జిల్లా బోర్గావ్ కు ఉదయం నుంచే నాయకులు, కార్యకర్తల రావడం ప్రారంభమైంది. ప్రియాంక గాంధీ పాదయాత్ర(Bharat Jodo Yatra)లో పాల్గొనబోతున్నారన్న వార్త రావడంతో, మాములు కన్నా ఎక్కువగా కార్యకర్తలు, అభిమానులు వచ్చారు. దాంతో, పాదయాత్ర సాగుతున్న ప్రాంతం జనసందోహంతో నిండిపోయింది. కార్యకర్తలు రాహుల్, ప్రియాంక(Priyanka Gandhi)ల దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా తాళ్లు పట్టుకుని అభిమానులు, కార్యకర్తలను నియంత్రించారు. రాహుల్, ప్రియాంకలను చూసిన అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) లో ప్రియాంక గాంధీ పాల్గొనడం ఇదే తొలిసారి. గతంలో యాత్ర కర్నాటకలో సాగుతున్న సమయంలో నాటి పార్టీ చీఫ్, రాహుల్ తల్లి సోనియా గాంధీ ఈ భారత్ జోడో యాత్రలో పాల్గొని, కాసేపు రాహుల్ తో పాటు కలిసి నడిచారు.

Sachin Pilot joins Bharat Jodo Yatra: సచిన్ పైలట్ కూడా..

భారత్ జోడో యాత్రలో గురువారం రాజస్తాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కూడా పాల్గొన్నారు. ఆయన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)లతో కలిసి నడిచారు. రాజస్తాన్ కాంగ్రెస్ లో వర్గ విబేధాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో సచిన్(Sachin Pilot) ఈ యాత్రలో పాల్గొనడం విశేషం. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ను మార్చాలని చాన్నాళ్లుగా పైలట్, ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. మధ్య ప్రదేశ్ అనంతరం భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) రాజస్తాన్ లో అడుగుపెడ్తుంది. మధ్య ప్రదేశ్ లో 380 కిమీల పాటు పాదయాత్ర సాగించి, డిసెంబర్ 4న రాజస్తాన్ లో అడుగుపెడ్తుంది.

Bharat Jodo Yatra: దేశవ్యాప్త పాదయాత్ర

దేశంలో విద్వేషాలను నిర్మూలించి, దేశ ప్రజలందరినీ ఐక్యం చేసే లక్ష్యంతో భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra)ను రాహుల్ గాంధీ ఈ సంవత్సరం సెప్టెంబర్ 7న తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ప్రారంభించారు. ఆ తరువాత, యాత్ర తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల్లో పూర్తయింది. దాదాపు 3600 కిమీల పాదయాత్ర అనంతరం వచ్చే సంవత్సరం కశ్మీర్ లో ముగుస్తుంది.