Priyanka to join Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో ప్రియాంక గాంధీ-bharat jodo yatra priyanka to join rahul gandhi in madhya pradesh ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Bharat Jodo Yatra: Priyanka To Join Rahul Gandhi In Madhya Pradesh

Priyanka to join Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో ప్రియాంక గాంధీ

HT Telugu Desk HT Telugu
Nov 22, 2022 10:51 PM IST

Priyanka to be in Bharat Jodo Yatra: విజయవంతంగా సాగుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర ‘భారత్ జోడో యాత్ర’లో ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా పాల్గొననున్నారు.

ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో)
ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో)

Priyanka to be in Bharat Jodo Yatra: తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ‘భారత్ జోడో యాత్ర’ విజయవంతంగా సాగుతోంది. తొలిసారి ఈ యాత్రలో రాహుల్ సోదరి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ కూడా పాల్గొననున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Priyanka to join Bharat Jodo Yatra in MP: మధ్య ప్రదేశ్ లో..

ప్రస్తుతం ‘భారత్ జోడో యాత్ర’ మహారాష్ట్రలో కొనసాగుతుంది. బుధవారం యాత్ర మధ్య ప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది. మధ్య ప్రదేశ్ లోని బుర్హాంపుర్ జిల్లాలో తన అన్న రాహుల్ గాంధీ చేపట్టిన దేశవ్యాప్త పాద యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. ఆమె దాదాపు 4 రోజుల పాటు రాహుల్ గాంధీతో పాటు నడుస్తారని పార్టీ నేత జైరాం రమేశ్ వెల్లడించారు. ఈ వార్త కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది.

Priyanka first time in Bharat Jodo Yatra: అన్నా చెల్లెలు కలిసి తొలిసారి..

రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో ప్రియాంక గాంధీ పాల్గొనడం ఇదే ప్రథమం. కర్నాటకలో యాత్ర సాగుతున్న సమయంలో నాటి కాంగ్రెస్ పార్టీ చీఫ్, రాహుల్ తల్లి సోనియా గాంధీ ఈ యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ తో పాటు కొద్ది దూరం నడిచారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా.. రాహుల్ గాంధీ, ఇతర నేతలు వారించినప్పటికీ.. ఆమె ఉత్సాహంగా కొడుకుతో పాటు నడిచారు.

Priyanka to join Bharat Jodo Yatra in MP: కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం

రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీలో కీలక నేత అయిన ప్రియాంక గాంధీ ఇప్పటివరకు పాల్గొనకపోవడంపై బీజేపీ ఇప్పటికే విమర్శలు ప్రారంభించింది. రాహుల్, ప్రియాంకల మధ్య సఖ్యత లేదని, అన్నాచెల్లెళ్ల మధ్య విబేధాలు ఉన్నాయని వ్యాఖ్యలు చేసింది. సఖ్యత లేకపోవడం వల్లనే వారు వేర్వేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, ఆ కారణంగానే ప్రియాంక ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొనడం లేదని జోస్యం చెప్పింది. అయితే, తాజాగా ‘భారత్ జోడో యాత్ర’లో ప్రియాంక పాల్గొనబోతోందన్న వార్త కాంగ్రెస్ శ్రేణులు, నాయకుల్లో కొత్త ఉత్సాహం నింపింది. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల్లో విజయవంతంగా కొనసాగింది.

IPL_Entry_Point