తెలుగు న్యూస్  /  National International  /  Mp: Nursery Student Raped In School Bus By Driver; Minister Says School Management Will Be Questioned

Nursery student raped: మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం

HT Telugu Desk HT Telugu

13 September 2022, 16:54 IST

  • Nursery student raped: మధ్యప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. మూడున్నరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. భోపాల్ లోని ప్రముఖ పాఠశాల బస్సులో ఈ దారుణం జరిగింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Nursery student raped: బస్సులో నర్సరీ చదువుతున్న చిన్నారిపై అత్యాచారం చేసిన బస్సు డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ డ్రైవర్ కు సహకరించిన మహిళాఅటెండెంట్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Nursery student raped: డ్రెస్ మార్చి..

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. భోపాల్ లోని ఒక ప్రముఖ పాఠశాలలో ఒక బాలిక నర్సరీ చదువుతోంది. రోజు స్కూల్ బస్ లో పాఠశాలకు వెళ్లి వస్తుంటుంది. ఆ పాప పేరెంట్స్ సాధారణంగా అదనంగా ఒక డ్రెస్ ను కూడా స్కూల్ బ్యాగ్ లో పెడ్తారు. ఒక రోజు ఆ పాప యూనీఫాంలో కాకుండా, స్పేర్ డ్రెస్ తో ఇంటికి వచ్చింది. దాంతో, ఆ పాప తల్లి ఆరా తీయగా స్కూల్ లో టీచర్ కానీ, ఆయాలు కానీ డ్రెస్ మార్చలేదని తేలింది. దాంతో, ఆ బాలికను అనునయంగా ప్రశ్నించగా, జరిగిన విషయాన్ని వివరించింది. ప్రైవేట్ పార్ట్స్ వద్ద నొప్పిగా ఉందని కూడా తెలిపింది. దాంతో వెంటనే ఆ పాప పేరెంట్స్ పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. ఈ ఘటనను దాచిపెట్టేందుకు ప్రయత్నించారని స్కూల్ యాజమాన్యం పై కూడా ఫిర్యాదు చేశారు.

Nursery student raped: కేసు నమోదు..

పేరెంట్స్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడైన డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. మహిళా సహాయకురాలి సాయంతో బస్సులోనే ఆ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో ఆ డ్రైవర్ వెల్లడించాడు. దాంతో, ఆ మహిళా అటెండెంట్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పొక్సొ సహా ఐపీసీ 376(ఏబీ) కింద కేసు నమోదు చేశామన్నారు.

Nursery student raped: హోం మంత్రి స్పందన

గత గురువారం జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. దాంతో, దోషులకు కఠినశిక్ష పడేలా చూస్తామని, స్కూల్ యాజమాన్యం పాత్రపై కూడా విచారణ జరుగుతుందని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ప్రకటించారు. రాష్ట్ర రాజధానిలో పట్టపగలు స్కూల్ బస్సులో జరిగిన దారుణానికి బాధ్యత వహించి, హో మంత్రి మిశ్రా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.