తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Morbi Hospital Painted Ahead Of Pm Modi Visit: విషాద వేళ.. ఆసుపత్రికి హంగులు

Morbi hospital painted ahead of PM Modi visit: విషాద వేళ.. ఆసుపత్రికి హంగులు

HT Telugu Desk HT Telugu

01 November 2022, 18:48 IST

    • Morbi hospital painted ahead of PM Modi visit: గుజరాత్ లో మొర్బి బ్రిడ్జ్ కుప్పకూలిన ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించడానికి ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం మొర్బిలోని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆ ఆసుపత్రికి హుటాహుటిన రిపేర్లు చేయడం, రంగులేయడం ఇప్పడు వివాదాస్పదంగా మారింది.
ప్రధాని పర్యటన సందర్భంగా మొర్బి ఆసుపత్రిలో రంగులు వేస్తున్న దృశ్యం
ప్రధాని పర్యటన సందర్భంగా మొర్బి ఆసుపత్రిలో రంగులు వేస్తున్న దృశ్యం (Twitter)

ప్రధాని పర్యటన సందర్భంగా మొర్బి ఆసుపత్రిలో రంగులు వేస్తున్న దృశ్యం

Morbi hospital painted ahead of PM Modi visit: గుజరాత్ లోని మొర్బిలో బ్రిటిష్ కాలం నాటి సస్పెన్షన్ బ్రిడ్జి కుప్పకూలిన ప్రమాదంలో సుమారు 134 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. దాదాపు 150 మందిని రక్షించారు. వారిని స్థానిక సివిల్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Morbi hospital painted ahead of PM Modi visit: ప్రధాని పర్యటన

ఈ విషాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తన దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఒక వీడియో కూడా విడుదల చేశారు. ప్రమాదం జరిగిన మొర్బి బ్రిడ్జ్ ను మంగళవారం పరిశీలించి, ఘటనకు కారణాలను తెలుసుకున్నారు. అనంతరం ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక సివిల్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. బాధితులతో స్వయంగా మాట్లాడారు.

Morbi hospital painted ahead of PM Modi visit: హుటాహుటిన రిపేర్లు, రంగులు

అయితే, ప్రధాని మోదీ వస్తుండడంతో ఆ ఆసుపత్రి భవనానికి సోమవారం రాత్రి నుంచి హుటాహుటిన రిపేర్లు చేయడం, రంగులు వేయడం ప్రారంభించారు. ప్రమాదం జరిగి, పెద్ద సంఖ్యలో మరణాలు చోటు చేసుకుని, ప్రజలంతా విషాదంలో ఉన్న సమయంలో.. వారిని పరామర్శించడానికి ప్రధాని వస్తుంటే, ఈ సమయంలో దాన్నో వేడుకగా ఆసుపత్రికి రంగులు వేసుకోవడం ఏంటని ఆసుపత్రి మేనేజ్ మెంట్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలోనూ ఇది వైరల్ అయింది. పలువురు ఆసుపత్రి భవనానికి రంగులు వేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తిట్ల వర్షం కురిపిస్తున్నారు.

Morbi hospital painted ahead of PM Modi visit: కాంగ్రెస్, ఆప్ ట్వీట్

దీన్ని అవకాశంగా తీసుకున్న ఆప్, కాంగ్రెస్ లు కూడా ఆ ఫొటోలను షేర్ చేస్తూ విమర్శలు గుప్పించాయి. హస్పిటల్ కు రంగులేయడాన్ని ‘ఈవెంట్ ఆఫ్ ట్రాజెడీ(event of tragedy) అని కాంగ్రెస్ కాప్షన్ పెట్టింది. ‘వారికి సిగ్గు లేదు. ప్రమాదం జరిగి ఎందరో చనిపోతే, వేడుకలు చేస్తారా? అని కామెంట్ చేసింది.